మీరు ఇష్టపడి కొనుక్కున్న ఫోన్‌ పోయిందా? ఇలా కనిపెట్టేయొచ్చు!

21 Mar, 2023 17:23 IST|Sakshi

ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్‌ పోతే. ఆ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా అందులో ఉండే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్‌ నెంబర్లు వేరే వాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు. అందుకే ఫోన్‌ పోయిందని తెగ హైరానా పడిపోతుంటాం. గతంలో ఫోన్‌ పోయిందంటే.. కొత్త ఫోన్‌ కొనుక్కోవడం తప్పా..పోయిన ఫోన్‌ను తిరిగి దక్కించుకునే అవకాశం ఉండేది కాదు.

ఇదిగో ఈ తరహా సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర టెలికాం విభాగం (dot), సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రీ (ceir) పేరుతో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల సాయంతో పొగొట్టుకున్న ఫోన్‌ను వెతికి పట్టుకోవచ్చు. తొలిసారిగా 2019 సెప్టెంబర్‌ నెలలో కేంద్రం వినియోగంలోకి తెచ్చింది. ముందుగా కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా - నగర్ హవేలీ,గోవా, మహరాష్ట్రలో,అదే ఏడాది డిసెంబర్‌ నెలలో ఢిల్లీలో లాంచ్‌ చేసింది. 

చదవండి👉 ఇది యాపారం?..విరాట్‌ కోహ్లీ ట్వీట్‌ వైరల్‌!


ఐఎంఈఐ నెంబర్‌ ఉందా?
కేంద్రం నిర్వహణలో సీఈఐఆర్‌ వెబ్‌ సైట్‌, యాప్స్‌ పనిచేస్తాయి. వీటిద్వారా కాణీ ఖర్చు లేకుండా ఐఎంఈఐ నెంబర్‌ సాయంతో మీ ఫోన్‌ను దక్కించుకోవచ్చు. *#06# డయల్‌ చేస్తే ఐఎంఈఐ నెంబర్‌ను పొందవచ్చు.  

పొగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి ఎలా పొందాలి?

సీఈఐఆర్‌ డేటా బేస్‌లో అన్నీ సంస్థల మొబైల్‌ ఆపరేటర్లు ఐఎంఈఐ డేటా ఉంటుంది. ఇందుకోసం కేంద్రం మొబైల్‌ బ్రాండ్స్‌, నెట్‌ వర్క్‌ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తుంది. 

సీఈఐఆర్‌ IMEI నంబర్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేస్తుంది. బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతుంది. సిమ్‌ కార్డ్‌ మార్చినా ఆ ఫోన్‌ పనిచేయదు. 

ఒక వేళ ఫోన్‌ను పొగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలిస్‌ స్టేషన్‌లో ఫిర‍్యాదు చేయాలి. ఫోన్‌  ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయించుకోవాలి. 

తర్వాత సీఈఐఆర్‌ పోర్టల్‌ ఓపెన్ చేస్తే అందులో బ్లాక్‌ స్టోలెన్‌/లాస్ట్‌ మొబైల్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అదే ఆప్షన్‌లో డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్షన్‌లో మీ ఫోన్‌కు సంబంధించిన మొత్తం వివరాలతో పాటు మీరు మీ ఫోన్‌ను చివరి సారిగా పోగొట్టుకున్న సమయం వివరాలను ఎంటర్‌ చేయాలి. అనంతరం ఎఫ్‌ఐఆర్‌ ఫోటోను అప్‌లోడ్‌ చేయాలి. 

యూజర్‌ సమర్పించిన వివరాల ఆధారంగా పోగొట్టుకున్న మొబైల్‌ను సీఈఐఆర్‌ బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్‌ చేసిన ఫోన్‌లో సిమ్‌ మార్చి వేరే సిమ్‌ వేసినా, వినియోగించినా ఐఎంఈఐ సాయంతో ఫోన్‌ ఎక్కడ ఉందో కనిపెట్టేస్తుంది. 

ఫోన్‌ దొరికిన వెంటనే ఆ ఫోన్‌ను అన్‌బ్లాక్‌ చేసేందుకు సీఈఐఆర్‌ పోర్టల్‌లో అన్‌ బ్లాక్‌ ఫౌండ్‌ మొబైల్‌పై క్లిక్ చేసి రిక్వెస్ట్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ వివరాలు సమర్పిస్తే ఫోన్‌ను వాడుకోవచ్చు. 

చదవండి👉 టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!

మరిన్ని వార్తలు