టాలీవుడ్ హీరోపై కేసు నమోదు

10 Jan, 2021 18:33 IST|Sakshi

ముంబయి: హీరో సచిన్ జోషీపై పుణెలోని ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతని మిత్రుడు పరాగ్ సంఘ్వి పిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిజినెస్ విషయంలో సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా సచిన్ జోషిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. పరాగ్ సంఘ్వి, సచిన్ జోషీ అతని భాగస్వాములతో కలిసి వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక ఒప్పందాన్ని  కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నేషనల్ రిసార్ట్ కోరేగావ్ పార్కుకు రూ.58 కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. కానీ జోషి 2016 నుండి పరాగ్ సంఘ్వికి ఎటువంటి చెల్లింపులు చేయలేదు.(చదవండి: అనసూయ ట్వీట్‌‌.. మెగా ఫ్యామిలీలో కలకలం!

ఈ విషయంపై అప్పుడే సంఘ్వి పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదును పూణే పోలీసుల క్రైమ్ బ్రాంచ్ యొక్క ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా జోషిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఇదేకాకుండా సచిన్‌ జోషికి చెందిన వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యొక్క 30 మంది మాజీ ఉద్యోగులు జీతాలు చెల్లించలేదని గతంలో ఆరోపణలు ఉన్నాయి. అలాగే 2020 అక్టోబర్‌లో టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కుంభకోణంలో సచిన్ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు