Layoffs: నా చిన్నారి పాపకు నేనేం చెప్పను? తొలగించిన గూగుల్‌ ఉద్యోగిని ఆవేదన!

27 Feb, 2023 20:43 IST|Sakshi

టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా తొలగించిన వారిలో కింది స్థాయి ఉద్యోగి నుంచి మేనేజర్‌ స్థాయి వరకు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన. ఇటీవల తొలగింపునకు గురైన ఓ ఉద్యోగిని తన ఆవేదనను లింక్డ్‌ఇన్‌లో రాసుకొచ్చారు.

(ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్‌! దీంతో ఎలా బతుకుతున్నారు సార్‌?) 

ఆకృతి వాలియా.. గూగుల్‌ క్లౌడ్‌లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా పనిచేసేవారు. ఈ మధ్యనే ఆమె సంస్థలో ఐదో వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారు. గూగుల్‌ ఇటీవల ప్రకటించిన లేఆఫ్స్‌లో ఆమె కూడా ఉద్యోగం కోల్పోయారు. తాను ఇంకో పది నిమిషాల్లో మీటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా తన కంప్యూటర్‌లో ‘యాక్సిస్‌ డినైడ్‌’ అని కనిపించడంతో ఆమె నిర్ఘాంతపోయారు. మొదట్లో నమ్మలేకపోయిన ఆమె తర్వాత విషయం తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె గూగుల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో ఉద్యోగం తన కలలన్నింటినీ సాకారం చేసిందని, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి కంపెనీ తనకు సహాయపడిందని వివరించారు.

(ఇదీ చదవండి: సూపర్‌ ఉంది కార్‌! విడుదలకు ముందే రోడ్డెక్కిన కియా ఈవీ9)

అయితే తాను ఉద్యోగాన్ని కోల్పోవడాన్ని తన ఆరేళ్ల కూతురుకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ‘నేను దీని బయట పడి ముందుకు వెళ్లగలను. అయితే ప్రస్తుతం అమ్మా నువ్వు ఎందుకు వర్క్‌ చేయడం లేదని నా చిన్నారి పాప అడిగితే వివరించడం చాలా నాకు చాలా కష్టతరమైనది’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు