-

ఆకాశంలో ఒక్కసారిగా పేలిపో​యిన రాకెట్‌....!

6 Sep, 2021 16:35 IST|Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్షాన్ని జయించడం కోసం మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే నాసా, పలు దేశాల అంతరిక్ష సంస్థలు అంతరిక్షాన్ని జయించాయి. నాసా, స్పేస్‌ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌, వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీలతో పాటు పలు ప్రైవేట్‌ కంపెనీలు కూడా  అంతరిక్ష ప్రయోగాలపై దృష్టి సారించాయి. అమెరికాకు చెందిన ఫైర్‌ఫై కూడా స్పేస్‌ రేసులో నిలిచేందుకు ఊవిళ్లురుతుంది. అందులో భాగంగా ఫైర్‌ఫ్లై తొలి రాకెట్‌ ఆల్ఫాను సెప్టెంబర్‌ 2న ప్రయోగించింది.
చదవండి: Nasa Evtol Aircraft: ఎలక్ట్రికల్‌ ఎయిర్‌ టాక్సీలపై నాసా ప్రయోగాలు

ఆల్ఫా రాకెట్‌ లాంచ్‌ చేసిన కొద్ది సేపటికే ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయింది. కాగా ఫైర్‌ఫ్లై చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. ఫైర్‌ఫ్లై పేలుడుకు సంబంధించిన వీడియోను అధికారికంగా కంపెనీ రిలీజ్‌ చేసింది. రాకెట్‌ ప్రయోగంలో చోటుచేసుకున్న లోపాలను సోషల్‌మీడియాలో ఫైర్‌ ఫ్లై పేర్కొంది. ఫైర్‌ఫ్లై ఒక ప్రకటనలో రాకెట్‌ లాంచ్‌ ఐనా రెండు నిమిషాల తరువాత రాకెట్‌లోని ఒక ఇంజన్‌ పనిచేయడం నిలిచిపోయినట్లు పేర్కొంది. దీంతో ఒకసారిగా రాకెట్‌ తన నిర్దేశిత మార్గం నుంచి పక్కకు పోయి ఒక్కసారిగా పేలిపోయిందని కంపెనీ పేర్కొంది.

ఆల్ఫా రాకెట్‌ భూ స్థిర కక్షలోకి ప్రవేశపెట్టనప్పటికీ, కంపెనీ భవిష్యత్తులో మరిన్నీ ప్రయోగాలను చేపట్టే నమ్మకం తమలో ఏర్పడిందని ఒక ప్రకటనలో పేర్కొంది.  రాకెట్లను నిర్మించగల, ప్రయోగించగల కంపెనీగా ఫైర్‌ఫ్లై నిరూపించిందని కంపెనీ తెలిపింది. 

మరిన్ని వార్తలు