ముందు భర్త.. ఆ వెంటే భార్య.. ఇద్దరూ బిలియనీర్లు అయ్యారు!

24 Mar, 2022 12:56 IST|Sakshi

వాళ్లిద్దరు ఐఐటీలో చదువుకున్నారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేశారు. అక్కడైన పరిచయం పరిణయానికి దారి తీసింది. ఆ తర్వాతే వేర్వేరుగా బిజినెస్‌లు పెట్టుకున్నారు. చివరకు ఇద్దరూ మూడు నెలల తేడాతో తమ వ్యాపారాల్లో రాణించి బిలియనీర్లు అయ్యారు. వారే ఆశీష్‌ మహాపాత్ర, రుచి కల్రా. ఇప్పుడీ యూనికార్న్‌ దంపతుల జంట స్టార్టప్‌ వరల్డ్‌లో సెన్సేషన్‌గా మారారు. 

ఒకే కాలేజీ నుంచి పాసవుట్‌ స్టూడెంట్లుగా అశీష్‌ మహాపాత్ర (41), రుచి కల్రా (38)లు మెకెన్సీ కంపెనీలో ఉద్యోగులు చేరారు. అక్కడైన పరిచయం ప్రేమగా మారి ఇద్దరు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం తమ మేథస్సుకు తగ్గట్టుగా వేర్వేరే స్టార్టప్‌లు ప్రారంభించారు. మహాపాత్ర దిల్లీ బేస్డ్‌గా ఆఫ్‌ బిజినెస్‌ పేరుతో రా మేటీరియల్‌ కొనుగులుకు సంబంధించిన టెక్‌ ప్లాట్‌ఫామ్‌గా పని చేస్తోంది. గత డిసెంబరులో 200 మిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట​ సాధించడంతో ఒక్కసారిగా ఆఫ్‌ బిజినెస్‌ మార్కెట్‌ వాల్యూ వన్‌ బిలియన్‌ డాలర్లు దాటింది. నయా యూనికార్న్‌గా మారింది. 

ఇక ఆక్సిజో పేరుతో ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ను మొదలెట్టింది రుచికల్రా. తాజాగా ఆక్సిజోలో ఆల్ఫావేవ్‌ గ్లోబల్‌, టైగర్‌ గ్లోబల్‌, నార్వెస్ట్‌ వెంచర్స్‌ పార్టనర్స్‌, మ్యాట్రిక్స్‌ పార్టనర్స్‌, క్రియేషన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మొత్తంగా 200 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరణ జరిగింది. దీంతో 2022 మార్చి 22న ఆక్సిజో మార్కెట్‌ విలువ వన్‌ బిలియన్‌ డాలర్లను క్రాస్‌ చేసింది. దీంతో యూనికార్న్‌ కంపెనీల జాబితాలో ఆక్సిజో చేరింది.

ఇప్పటి వరకు అనేక స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాయి. ఆయా స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా రూపుదిద్దుకోవడంలో భార్తలకు భార్యలు సహాకారం అందిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో భార్యలకు భర్తలు వెన్నుదన్నుగా ఉన్నారు. బైజూస్‌లో విషయంలో ఇదే జరిగింది. కానీ దేశంలో తొలిసారిగా భార్యభర్తలిద్దరు వేర్వేరుగా స్టార్టప్‌లు పెట్టి ఇద్దరూ సక్సెస్‌ అయ్యారు. 
 

మరిన్ని వార్తలు