StockMarketUpdate: దలాల్ స్ట్రీట్ రికార్డ్‌: 63 వేల ఎగువకు సెన్సెక్స్‌

30 Nov, 2022 15:53 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ  లాభాలతో ముగిసాయి. ఆరంభ లాభాలను  మొదట్లో కోల్పోయిన సూచీలు ఆతరువాత ఒక రేంజ్‌లో  ఎగిసాయి.  తద్వారా సెన్సెక్స్‌  63 వేల స్థాయిని సునాయాసంగా దాటేసింది. అంతేకాదు రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేసింది. వరుసగా ఏడో రోజూ జోరుతో ఆల్-టైమ్‌ హైకి చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ లాభాల నార్జించాయి.

ముఖ్యంగా మూడు గంటలతర్వాత రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, అదానీ షేర్ల లాభాలు మార్కెట్లను రికార్డు స్థాయిల వైపు మళ్లించాయి. ఆటో షేర్లు మెరిపించాయి.  ఒక దశలో సెన్సెక్స్‌ 600పాయింట్లకు పైగా  ఎగిసింది.  చివరికి సెన్సెక్స్‌  418 పాయింట్లు  ఎగిసి 63009 వద్ద, నిఫ్టీ140 పాయింట్లు 187580 వద్ద స్థిరపడ్డాయి. 

ఎం అండ్ ఎం, హిందాల్కో, గ్రాసిం, సిప్లా ఐషర్‌ మోటార్స్‌, బజాజ్ ఆటో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, డా.రెడ్డీస్ టాప్‌ విన్నర్స్‌గా, ఇండస్‌ ఇండస్‌ ఇండ్,  ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  అటు డాలరు  మారకంలో రూపాయి 36 పైసలు ఎగిసి 81.42 వద్ద ఉంది.   

మరిన్ని వార్తలు