జియో నెక్ట్స్‌ ఫోన్‌... ఫస్ట్‌ వీడియో.. ఓ లుక్కెయ్యండి!

30 Oct, 2021 12:24 IST|Sakshi

అత్యాధునిక ఫీచర్లతో తక్కువ ధరలో రిలయన్స్‌ అందిస్తున్న జియో ఫోన్‌ పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొదట వినాయక చవితికి ఈ ఫోన్‌ని మార్కెట్‌లోకి తెస్తామంటూ రిలయన్స్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించినా.. వాస్తవంలో అది సాధ్యపడలేదు. 

గూగుల్‌, రిలయన్స్‌ సంస్థలు భారతీయు అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫోన్‌ను రూపొందించారు. ఇందులో కొత్తగా ప్రగతి అనే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని సైతం పొందు పరిచారు. వాయిస్‌ కమాండ్‌, ట్రాన్స్‌లేట్‌ తదితర ఫీచర​‍్లు ఈ మొబైల్‌లో ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. కానీ మొదటి వీడియోను ఏఎన్‌ఐ నెట్‌వర్క్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

చదవండి :జియో ఫోన్‌ ధర ఎంతో చెప్పిన ముఖేష్‌ అంబానీ..!

మరిన్ని వార్తలు