ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త

9 Jun, 2022 17:49 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)  తన ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వ‌డ్డీ రేట్లు పెంచే సంకేతాలిచ్చింది.  తాజా ద్వైమాసిక రివ్యూలో ఆర్బీఐ రెపో రేటును  50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్‌బీఐ  నిర్ణయం  తీసుకోనుంది.  ఈ మేరకు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచనున్నట్టు  నేషనల్‌ మీడియా నివేదించింది.

ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతంగా నిర్ణయించింది. ఫలితంగా  పలు రుణాలపై ఈఎంఐ భారం పెరగనుంది.  ఆర్‌బీఐ క్రమంగా రేట్లు పెంచుతూ ఉంటే, బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా పెంచాల్సి వస్తుంది. దీంతో తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కొత్త రేట్ల ప్రకారం ఉంటాయనీ, ఇప్పటికే నిర్దిష్ట మెచ్యూరిటీల పై డిపాజిట్ రేట్లను పెంచాలని భావిస్తున్నట్టు ఖరా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఎస్‌బీఐ 12 నెలల - 24 నెలల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  5.10 వడ్డీ రేటును అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే  మూడు నుండి ఐదు సంవత్సరాల  ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.45 శాతంగా  ఉంది 

మరిన్ని వార్తలు