ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు

4 Jan, 2024 15:55 IST|Sakshi

2024లోనే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు 'ఫిక్స్‌డ్ డిపాజిట్' వడ్డీ రేట్లను పెంచనున్నట్లు పెంచుతున్నట్లు ప్రకటించి శుభవార్త చెప్పింది. ఈ కథనంలో ఏ బ్యాంకు ఎంత మేర వడ్డీ పెంచింది, దాని వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ ఎస్‌బీఐ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ వడ్డీ రేట్లు గతంలో ఉన్న వడ్డీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సీనియర్ సిటిజన్లంటూ 0.50 శాతం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 7 రోజుల నుంచి 45 రోజులకు సాధారణ వడ్డీ 3.50 శాతం అనుకుంటే సీనియర్ సిటిజన్లను 4 శాతం వడ్డీ లభిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI)
భారతదేశంలో రెండవ అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కూడా వడ్డీ రేట్లను 6.7 సంత నుంచి 7.25 శాతానికి పెంచింది. 61 రోజుల నుంచి 90 రోజులకు 6 శాతం, 91 రోజుల నుండి 184 రోజులకు 6.5 శాతం, 185 రోజుల నుంచి 270 రోజులకు 6.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు 7.25 శాతం వడ్డీ అందించనుంది. జనవరి 3 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC)
2023 అక్టోబరు నుంచి HDFC బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. ఒక సంవత్సరం నుంచి 15 నెలల కాలనీ వడ్డీ 6.6 శాతం, 15 నెలల నుంచి 18 నెలల వరకు వడ్డీ 7.10 శాతం, 18 నెలల నుంచి 21 నెలలకు వడ్డీ 7 శాతం, 21 నెలల నుంచి 2 సంవత్సరాల కాలనీ 7 శాతం వడ్డీ అందిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)
2023 డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు 6.85 శాతం వడ్డీ, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వ్యవధికి 7.25 శాతం వడ్డీ, 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి వడ్డీ 6.5 శాతం అందిస్తోంది. వీటితో పాటు బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ అని పిలువబడే 399 రోజుల డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ పొందవచ్చు.

ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్‌

యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)
2023 డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి 15 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 6.7 శాతం ఆఫర్ చేస్తోంది . 15 నెలల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతం అందిస్తుంది.

డీసీబీ బ్యాంక్ (DCB Bank)
2023 డిసెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం వినియోగదారుని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సంవత్సరానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు 7.15 శాతం వడ్డీని, 25 నెలల లేదా 26 నెలల మధ్య కాల వ్యవధి డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేటు 8 శాతం అందించడం జరుగుతుంది.

>
మరిన్ని వార్తలు