మరో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థను కొనుగోలు చేసిన ఫ్లిప్‌కార్ట్‌!

20 Apr, 2022 16:40 IST|Sakshi

న్యూఢిల్లీ: గ్లోబల్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ గ్రూప్‌ ఈకామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా ఏఎన్‌ఎస్‌ కామర్స్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. తద్వారా దేశీయంగా ఆన్‌లైన్‌ రిటైల్‌ ఎకోసిస్టమ్‌ను పటిష్ట పరచనున్నట్లు తెలియజేసింది.

అయితే ఏఎన్‌ఎస్‌ కామర్స్‌ ఇకపైన కూడా స్వతంత్ర ఈకామర్స్‌ సొల్యూషన్స్‌ ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది.అంతేకాకుండా ప్రస్తుత యాజమాన్యమే కంపెనీ నిర్వహణను కొనసాగించనున్నట్లు తెలియజేసింది.  అయితే డీల్‌ విలువను వెల్లడించలేదు.
 

మరిన్ని వార్తలు