ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌: ఐఫోన్‌ 14 పై రూ. 44వేల భారీ తగ్గింపు 

31 Mar, 2023 11:16 IST|Sakshi

సాక్షి, ముంబై: యాపిల్‌ ఐఫోన్‌ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది.ఈ రోజు (మార్చి 31) ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో అనేక ఉత్పత్తులపై స్మార్ట్‌డీల్స్‌ అందిస్తోంది. ముఖ్యంగా  ఖరీదైన ఐఫోన్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ను  సొంతం  చేసుకోవాలనుకుంటున్న వారికి బంపర్‌ ఆఫర్‌. దాదాపు రూ. 44,901 తగ్గింపు తర్వాత కేవలం రూ. 34,999కి అందుబాటులో ఉంది. (సంక్షోభ సమయంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ గుడ్‌న్యూస్‌)

మార్చి 31 నుండి  ఏప్రిల్‌ 3  వరకు జరిగే బిగ్ బచత్ ధమాల్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌  మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై తగ్గింపును అందిస్తోంది.  ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,901 తగ్గింపుతో  రూ.68,999కి విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్,  డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.4000 తక్షణ తగ్గింపు, స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌లో  రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా రూ. 44,901 తగ్గింపు తర్వాత యాపిల్‌  14 ఫ్లిప్‌కార్ట్‌లో  రూ. 34,999కి లభించనుంది.

(ఇదీ చదవండి: హయ్యస్ట్‌ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌ కొట్టేసిన అవని మల్హోత్రా)

యాపిల్‌ ఐఫోన్‌ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే 12 ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా,12 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ప్రధాన ఫీచర్లుగా  ఉన్నాయి. 

(అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!)

మరిన్ని వార్తలు