Flipkart Big Saving Days 2021 Sale: ఆఫర్ల పండగ

23 Jul, 2021 11:11 IST|Sakshi

జూలై 25 ఆదివారం - జూలై 29 గురువారం వరకు

బిగ్ సేవింగ్ డేస్ సేల్‌,  రూ.1కే బుక్‌ చేసుకోవచ్చు

మినీ ఫ్లాష్ అమ్మకాలు

ఎంపిక చేసిన ఉత్పత్తులపై టిక్ టాక్ డీల్స్ ఫ్లాష్ 

సాక్షి,ముంబై: ప్రముఖ ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్‌ సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్‌’ ఐదు రోజుల డిస్కౌంట్‌ అమ్మకాలకు తెరతీసింది. జూలై 25 ఆదివారం నుండి జూలై 29 వరకు ఈ సేల్‌ కొనసాగుతుంది. ఇందులో ఆపిల్‌ ఐఫోన్లు, శాంసంగ్‌,రియల్‌మి, పోకో, మోటరోలా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్‌లను అందించనుంది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మినీ ఫ్లాష్ అమ్మకాలను కూడా నిర్వహించనుంది.  అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ 
జూలై 24 అర్ధరాత్రి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్  సేల్‌ అందుబాటులోఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపురేట్లను అందించనుంది.ఇంకా ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, వైర్‌లెస్ రౌటర్లు ఇతరఎలక్ట్రానిక్స్‌పై తగ్గింపును లభించనుంది. దీనికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌, నో-కాస్ట్ ఈఎంఐ  కూడా లభ్యం. ఇండియాలో అమెజాన్  ప్రైమ్ డే  సేల్‌ ప్రారంభానికి ఒక రోజు ముందు ఫ్లిప్‌కార్ట్ తన డిస్కౌంట్‌ అమ్మకాలను మొదలు పెట్టడం విశేషం. 

రూ.  1 చెల్లించి  ప్రీబుకింగ్‌ : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్  డేస్‌ సేల్‌  కేవలం ఒక రూపాయితో  ప్రీ-బుకింగ్‌ చేసుకునే అవకాశాన్నిస్తోంది. సేల్‌ ప్రారంభం తరువాత  మిగిలిన ధరను చెల్లించి సంబంధిత  వస్తువునుకొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్‌ ధరలు
ఐఫోన్ 12 రూ. 67,999 (ఎంఆర్‌పి రూ .79,999)
ఐఫోన్ ఎస్‌ఇ రూ. 28,999 (ఎంఆర్‌పి రూ .39,900)
 మోటరోలా రేజర్ రూ. 54,999 (ఎంఆర్‌పి రూ. 1,49,999)

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రూ. 9,999 
రియల్‌మీ సి 25 రూ. 9,999 (ఎంఆర్‌పి రూ .10,999)
పోకో ఎక్స్ 3 రూ. 15,999 (ఎంఆర్‌పి రూ .19,999) 
ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్‌డి 2021 రూ. 6,499 (ఎంఆర్‌పి రూ .7,999


ఫ్లిప్‌కార్ట్ మినీ ఫ్లాష్  సేల్‌:అతి తక్కువ ధరకే
రానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో  భారీ డిస్కౌంట్‌తో క్రేజీ డీల్స్  అందుబాటులో ఉండనున్నాయి. అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 ,సాయంత్రం 4 గంటలకు  మినీ ఫ్లాష్‌ సేల్‌ను నిర్వహించనుంది. అంటే పలు ప్రొడక్ట్స్‌ నిమిషాల్లోనే హాట్‌ కేకుల్లా అమ్ముడవుతాయి. దీంతోపాటు ఎంపిక చేసిన ఉత్పత్తులపై టిక్ టాక్ డీల్స్ ఫ్లాష్ సేల్‌ను  కూడా  ప్రకటించింది. ఇందులో  ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు అతి తక్కువ ధరలకే పలు ఉత్పత్తులు  లభించనున్నాయి. 

మరిన్ని వార్తలు