ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌ సేల్‌ పండగ: భారీగా ఆఫర్లు

2 Aug, 2021 17:37 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ "బిగ్ సేవింగ్ డేస్ సేల్‌" పేరుతో మరోసారి సరికొత్త డిస్కౌంట్‌ సేల్‌ను తీసుకొని వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌ సేల్‌ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఆపిల్‌ ఐఫోన్లు, శాంసంగ్‌, ఒప్పో, వివో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా కిచెన్ వంటి పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్‌లను అందించనుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.

గత కొద్ది రోజుల క్రితమే జూలై 25 నుంచి జూలై 29 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ పేరుతో సేల్ నిర్వహించింది. ఇప్పుడు మరోసారి అదే పేరుతో సేల్ తీసుకొని వచ్చింది. ఎప్పటిలాగే, ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగానే సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్లస్ సభ్యులు డీల్స్ ను ముందస్తుగా యాక్సెస్ చేసుకోగలరు. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపురేట్లను అందించనుంది. ఇంకా ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, వైర్‌లెస్ రౌటర్లు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై తగ్గింపును లభించనుంది. అమ్మకం సమయంలో కంపెనీ మొబైల్స్, టాబ్లెట్లపై డిస్కౌంట్ అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ & యాక్ససరీలపై 80 శాతం వరకు, టీవీ & ఉపకరణాలపై 75 శాతం వరకు, దుస్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్‌ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
 

మరిన్ని వార్తలు