వచ్చేసింది...ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌..స్మార్ట్‌ఫోన్స్‌, ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!

11 Apr, 2022 19:20 IST|Sakshi

Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలుదారుల కోసం బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ - 2022ను ప్రకటించింది. ఈ సేల్‌ ఏప్రిల్‌ 12 నుంచి ఏప్రిల్‌ 14 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, ఆఫర్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. 

ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులు 12 గంటల ముందుగానే బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేవింగ్స్‌లో పాల్గొనే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్‌ కల్పిస్తోంది. ఈ సేల్‌ భాగంగా ఐసీఐసీఐ బ్యాంకుతో కొనుగోలుచేసే ఉత్పత్తులపై 10 శాతం ఇన్‌స్టంట్‌ తగ్గింపు ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ఇక పలు స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుపై భారీ తగ్గింపును ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. శాంసంగ్‌, రెడ్‌మీ, షావోమీ, రియల్‌మీ, మోటరోలా, ఇన్ఫీనిక్స్‌ కంపెనీల స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై  తగ్గింపు వర్తించనుంది. 

బిగ్ సేవింగ్ డేస్ సేల్‌-2022లో పలు మొబైల్ ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోన్న డీల్స్‌..

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌23 5జీ
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ భారత మార్కెట్లలోకి శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌23 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌23 5జీ స్మార్ట్‌ఫోన్‌ రూ. 15, 999కు లభించనుంది. దీని లిస్టెడ్‌ ధర రూ. 22, 999. ఇదిలా ఉండగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డుతో ఈఎంఐలో కొనుగోలుచేస్తే అదనంగా రూ. 1,000 తగ్గింపున పొందవచ్చును. 

రెడ్‌మీ నోట్‌ 10టీ 5జీ
భారత్‌లో అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మీ నోట్‌ 10టీ 5జీ కూడా ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్‌  రూ. 13,999 కు రానుంది. దీని అసలు ధర రూ.16,999. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే...రూ. 1000 వరకు తక్షణ తగ్గింపు కూడా రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్సేఛేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. 

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్
ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌లో భాగంగా మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 19,499 కు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 25,999. 

పోకో ఎం4 ప్రో 5జీ
పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు రూ. రూ. 12, 999 అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 16,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్సేఛేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. 

రియల్‌మీ 9 ప్రో ప్లస్‌ 5జీ
ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌లో భాగంగా రియల్‌మీ 9 ప్రో ప్లస్‌ 5జీ ధర రూ. 19,999కు రానుంది. దీని అసలు ధర రూ. 27, 999. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 24,999కు రిటైల్‌ అవుతోంది. 

చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్‌..! రూ. 60 వేల విలువైన ఐఫోన్‌ రూ.15 వేలకే..ఇంకా మరెన్నో ఆఫర్స్‌

మరిన్ని వార్తలు