ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌.. ఆఫర్లే ఆఫర్లు

17 Jan, 2021 20:52 IST|Sakshi

ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ జనవరి 20 నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ జనవరి 24తో ముగుస్తుంది. ఈ సేల్ లో హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఈఎంఐ ద్వారా కొనుగోలు యూజర్లకు 10 శాతం తగ్గింపు లభించనుంది. ఈ సేల్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ల మీద ఉత్తమ ఆఫర్లను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. శామ్‌సంగ్ ఎఫ్ 41, ఐఫోన్ ఎక్స్‌ఆర్, మోటో జీ 5జీతో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మీద ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో డిస్కౌంట్ లభించనుంది. 

ఈ సేల్లో భాగంగా ఐఫోన్ 11ను సుమారు 48,999 రూపాయలకు పొందవచ్చు. అలాగే మోటరోలా మోటో జి 5జీ రూ.18,999కు లభిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, పీసీ, హెడ్‌ఫోన్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్  ఉపకరణాల మీద 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో స్మార్ట్ టీవీలు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఉపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్యాషన్‌ యాక్సెసరీలపై 50-80శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఉత్పత్తుల మీద చాలా తక్కువ ధరలో తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. 
 

మరిన్ని వార్తలు