ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌:స్పెషల్‌ డిస్కౌంట్స్‌ అండ్‌ డీల్స్‌

23 Jul, 2022 11:20 IST|Sakshi

జూలై 23- 27 వరకు 

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్ సేల్ 2022

సాక్షి, హైదరాబాద్‌: ఇ-కామర్స్  దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022కు తెరతీసింది. నేటి (జూలై 23న) అర్థరాత్రి నుంచిబిగ్ సేవింగ్‌డేస్‌ సేల్‌ షురూ కానుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్‌లో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్‌లు, స్పెషల్‌ డీల్స్‌ను పొందవచ్చు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపును,  టీవీలు, ఇతర ఉపకరణాలపై 70 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఒప్పో, ఆపిల్‌, వివో,  మోటరోలా తదితర స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు రేట్లు అందిస్తోంది. 

అలాగే హెడ్‌ఫోన్‌లపై 70 శాతం వరకు తగ్గింపును కూడా అందజేయనుంది. మౌస్, రూటర్లు, కీబోర్డులు తదిర కంప్యూటర్ ఉపకరణాలు రూ.99 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. బిగ్‌ స్క్రీన్ టాబ్లెట్‌  కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న కస్టమర్‌లు 45 శాతం తగ్గింపుతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్‌లపై 65 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. అంతేకాదు సేల్  ప్రతిరోజూ  అర్థరాత్రి 12 గంటలకు ఉదయం 8 గంటలకు,  సాయంత్రం 4 గంటలకు  తాజా డీల్స్‌ను కూడా ప్రకటిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకు, కోటక్ బ్యాంక్ ,ఆర్‌బిఎల్ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ ‘ప్లస్’ సభ్యుల కోసం ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్  సేల్‌  ప్రారంభమైంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ డే సేల్ కూడా జూలై 23 అర్ధరాత్రి నుండి ప్రారంభం కానుంది. 

ఇది కూడా చదవండిఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12పై భారీ తగ్గింపు

మరిన్ని వార్తలు