ఫ్లిప్‌కార్ట్: మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్

18 Dec, 2020 14:45 IST|Sakshi

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 పేరిట కొత్త సేల్ ని తీసుకొచ్చింది. నేటి నుండి(డిసెంబర్ 18) నుండి డిసెంబర్ 22 వరకు ఈ సేల్ కొనసాగనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. సేల్ లో భాగంగా 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్(రూ.1,500 వరకు) ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బిఐ కార్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ సేల్ లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమమైన డీల్స్ మీకోసం మేము అందిస్తున్నాం.(చదవండి: పదకొండు వేలకే రెడ్‌మీ 9 పవర్

  • పోకో ఎక్స్ 3 మొబైల్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 4,000 రూపాయల ధర తగ్గింపుతో 15,999 రూపాయలకు లభిస్తుంది.
  • ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ మొబైల్ 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 8,900 రూపాయల ధర తగ్గింపుతో 38,999 రూపాయలకు లభిస్తుంది.
  • ఐఫోన్ 11 ప్రో మొబైల్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 26,600 రూపాయల ధర తగ్గింపుతో 38,999 రూపాయలకు లభిస్తుంది.
  • ఎల్జీ జీ 8 ఎక్స్ మొబైల్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 44,000 రూపాయల ధర తగ్గింపుతో 25,990 రూపాయలకు లభిస్తుంది.
  • ఆసుస్ రోగ్ ఫోన్ 3 మొబైల్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 11,000 రూపాయల ధర తగ్గింపుతో 44,999 రూపాయలకు లభిస్తుంది.
  • ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 15,000 రూపాయల ధర తగ్గింపుతో 39,990 రూపాయలకు లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఉత్తమ ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ యొక్క హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్ ఈ సేల్ లో భాగంగా 16,900(ఎంఆర్‌పి రూ.19,900)కే లభిస్తుంది. హోమ్‌పాడ్ ఎయిర్‌ప్లే 2కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆసుస్ సన్నని, తేలికపాటి వివోబుక్ 14 ల్యాప్‌టాప్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40,990(ఎంఆర్‌పి రూ.54,990)కి లభిస్తుంది. ల్యాప్‌టాప్ ఏఎండీ యొక్క రైజెన్ 5 క్వాడ్-కోర్ సిపియుతో పనిచేస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డితో వస్తుంది.

మీరు పెద్ద స్క్రీన్ టీవీని కొనాలని భావిస్తుంట శామ్‌సంగ్ 55-అంగుళాల స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ(యుఎ 55 టియు 8000 కెఎక్స్ఎక్స్ఎల్) సేల్ లో రూ.62,590(ఎంఆర్‌పి రూ .86,900)కి లభిస్తుంది. ఎస్బిఐ కార్డుదారులు 10 శాతం(రూ.1,500 వరకు) అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఎంఎస్‌ఐ జీఎఫ్ 63 గేమింగ్ ల్యాప్‌టాప్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా రూ.54,990 (ఎంఆర్‌పి రూ.94,990)కి లభిస్తుంది. ల్యాప్‌టాప్ 9వ తరం ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డి ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం, ఎన్విడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1650 కార్డ్ ఉంది. 

మరిన్ని వార్తలు