‘ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు భారీ షాక్‌’

29 Oct, 2022 15:17 IST|Sakshi

దేశీయ ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు షాకిచ్చింది.  ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీఓడీ)’ ఆప్షన్‌ ఎంచుకున్న కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ల నుంచి బుక్‌ చేసిన కొనుగోలు దారులపై ఈ అదనపు ఛార్జీల భారం పడనుంది. 

ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం సంబంధిత ప్రొడక్ట్‌లపై డెలివరీ ఛార్జీలను వసూలు చేసేది. ఏదైనా రూ.500 లోపు వస్తువుల్ని ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి బుక్‌ చేసుకుంటే వాటిపై రూ.40 డెలివరీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 మించిన ప్రొడక్ట్‌ ధరపై ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని ప్లిప్‌కార్ట్‌ తన వెబ్‌ సైట్‌లో పేర్కొంది. కానీ ఇప్పుడు డెలివరీ ఛార్జీలను ఎత్తివేసింది. వాటికి బదులు సీఓడీ సౌకర్యం కావాలనుకున్న కస్టమర్ల నుంచి మినిమం ఛార్జీ రూ.5 వసూలు చేస్తుంది. 

చదవండి👉 నాసిరకం ప్రెజర్‌ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్‌కు భారీ ఫైన్‌!

పెరిగిపోతున్న నెట్‌లాస్‌
ఆర్ధిక సంవత్సరం 2021-2022లో ప్లిప్‌కార్ట్‌ వృద్ధి రేటు రూ.10,659 కోట్లుగా ఉంది. అదే సమయంలో గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే మార్చి 2022 ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి నెట్‌ లాస్‌ రూ.4,362 కోట్లుగా ఉంది. అయితే ఆ నష్టాలకు కారణం పెరిగిపోతున్న రవాణా , మార్కెటింగ్‌, లీగల్‌ ఎక్సెపెన్సెస్‌ అని ప్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు తెలిపారు.

చదవండి👉 అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌

మరిన్ని వార్తలు