ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌ : ఆఫర్లు

30 Nov, 2020 16:48 IST|Sakshi

ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం తగ్గింపు

8999 రూపాయలు ధర వద్దే  స్మార్ట్‌టీవీ

ప్రతీ నెల మొదటి రోజుల్లో ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌

ల్యాప్‌టాప్‌లపై 30శాతం డిస్కౌంట్‌

సాక్షి,ముంబై: ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌  మరోసారి తగ్గింపు ధరలతో వినియోగ‌దారుల‌ను ఆకర్షిస్తోంది. ఇటీవల ఐదు రోజుల బ్లాక్ ఫ్రైడే అమ్మకాన్ని చేపట్టిన సంస్థ తాజాగా ప్రతీ నెల మొదటి రోజుల్లో ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌ పేరుతో బంప‌ర్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనుంది.  రేపటి ( 2020, డిసెంబర్ 1-3 వరకు) అందిస్తు‍న్న ఈ  సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం తగ్గింపును అందిస్తోంది. అలాగే  టీవీలు, ఏసీలు  రిఫ్రిజిరేటర్లలో 50 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇంకా బట్టలు, పాదరక్షలు, ఉపకరణాలు, బ్యూటీ, క్రీడలు, ఫర్నిచర్, గృహాలంకరణ ఇతర ఉత్పత్తులపై  డిస్కౌంట్, ఆఫర్లను  ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్.కామ్‌లోఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే వెబ్‌సైట్‌లో అమ్మకం కోసం ల్యాండింగ్ పేజీని తీసుకొచ్చింది.

పాదరక్షలు, బట్టలు, క్రీడా పరికరాలు, ఫర్నిచర్, గృహాలంక‌ర‌ణ‌  త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌పై కూడా త‌గ్గింపును ప్ర‌క‌టించింది. హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 70శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ల్యాప్‌టాప్‌లపై 30శాతం డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది. అలాగే స్మార్ట్‌వాచ్‌లు,  ఫిట్‌నెస్ బ్యాండ్‌లాంటిపై కూడా  తగ్గింపులో ధరల్లో అందిస్తోంది.  8,999 రూపాయలు ధర వద్దే స్మార్ట్ టీవీలను అందిస్తోంది.స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ బ్యాండ్లు ప్రారంభ ధర 1,299 గా ఉంచింది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ స‌దుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్లు, వారంటీ పొడ‌గింపు వంటి స‌దుపాయం కూడా ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు