‘ఫిల్మీమోజీ’ తరహాలో..మెటావర్స్‌లో అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్‌

17 Oct, 2022 16:47 IST|Sakshi

ఫ్లిప్‌కార్ట్‌ మరో అడుగు ముందుకు వేసింది. ఈ కామర్స్‌ మార్కెట్‌లో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ ఫ్లిప్‌వెర్స్‌ అనే మెటావర్స్‌ వర్చువల్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ ఫామ్‌ను ప్రారంభిస్తున్నట్లు (ఇవాళే) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఈ డీఏఓ (eDAO)తో  చేతులు కలిపింది. ప్రస్తుతం, ఈ ఫ్లిప్‌వెర్స్‌ ప్రారంభ దశలో ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 

ఫ్లిప్‌వర్స్‌తో ఏం చేయొచ్చు
ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ ఇ-కామర్స్ ప్రపంచాన్ని మార్చబోతున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు దారుల్ని ఆకర్షించేలా వారికి కొత్త షాపింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. మరో మాటలో చెప్పాలంటే, ఉదాహరణకు యూట్యూబ్‌లో ‘ఫిల్మీమోజీ’ అనే తెలుగు వీడియోస్‌ను చూసే ఉంటారు. ఐఫోన్‌లో మెమోజీ అనే ఫీచర్‌ను ఉపయోగించి ఇందులో పాత్రలను రూపొందించారు. వీటితో మనుషుల పోలిన అవతారాలను సృష్టించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ కూడా అంతే. ఈ ఫ్లిప్‌వెర్స్‌లో మీకు నచ్చిన ప్రొడక్ట్‌ను అలా తయారు చేసి డిస్‌ప్లేలో పెడుతుంది. మెటావర్స్‌ సాయంతో డిస్‌ప్లేలో ఉన్న ప్రొడక్ట్‌ను సెలక్ట్‌ చేసి షాపింగ్‌ చేసుకోవచ్చు. 

కొనుగోలు దారుల్ని ఆకర్షిస్తుంది
ఫ్లిప్‌వెర్స్‌ ఈవెంట్ లాంచ్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు మాట్లాడుతూ..తాము ముందే  చెప్పినట్లుగా ..ఫ్లిప్‌వర్స్ చాలా ప్రత్యేకం. మెటావర్స్ అవతార్ల రూపంలో వర్చువల్ రియాలిటీతో వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. అలాగే, వర్చువల్ షాపింగ్ ద్వారా కొనుగోలు దారులకు నచ్చిన ప్రొడక్ట్‌ను చెక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు