క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు

8 Jun, 2021 12:47 IST|Sakshi

అందుబాటులోకి తెచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ 

హైదరాబాద్‌: క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా నగదు చెల్లించే విధానాన్ని ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ అమల్లోకి తెచ్చింది. ఆర్డర్‌ చేసిన వస్తువు కవర్‌పై ఉండే  క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి కస్టమర్లు డిజిటల్‌ పేమెంట్‌ చేయోచ్చు.  పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యూపీఐ యాప్‌ను వినియోగించవచ్చు. చెల్లింపుల విషయంలో క్యూఆర్‌ కోడ్‌ విధానంతో వినియోగదార్లలో విశ్వాసం పెరుగుతుందని వివరించింది.

సీఓడీ ఆప్షన్‌తో
కరోనా కారణంగా టచ్‌ తగ్గించడం ప్రధానంగా మారింది. అయితే క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ ఎంచుకున్నప్పుడు నగదు చెల్లింపు కొంత రిస్క్‌గా మారింది. దీంతో సీఓడీ ఆప్షన్‌లో క్యూఆర్‌ కోడ్‌ పేమెంట్‌ ఆప్షన్‌ని ఫ్లిప్‌కార్ట్‌ అమల్లోకి తెచ్చింది.

మరిన్ని వార్తలు