flipkart: ఫ్లిప్‌కార్ట్‌, సోని బంపర్‌ ఆఫర్లు

6 Oct, 2021 09:18 IST|Sakshi

బెంగళూరు:‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ కార్యక్రమంలో భాగంగా బెస్ట్‌ప్రైజ్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ వేదికలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ నెల 3 నుంచి 10 వరకు ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌కు సంబంధించి బిగ్‌ బిలియన్‌ డేస్‌ను వరుసగా రెండో ఏడాది నిర్వహిస్తోంది.

ఫ్యాషన్, గ్రోసరీ తదితర విభాగాల్లో 4 లక్షలకుపైగా ఉన్న ఉత్పత్తుల నుంచి 15 లక్షల కిరాణా వర్తకులు, రిటైల్‌ విక్రేతలు షాపింగ్‌ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఎక్కువ మార్జిన్లను ఆఫర్‌ చేస్తున్నామని.. వీటిని వినియోగదారులకు అందించడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవచ్చని తెలిపింది. 14 రోజుల వరకు వడ్డీలేని క్రెడిట్‌ సదుపాయం (రూ.10వేల నుంచి రూ.25 లక్షల వరకు) పొందొచ్చని ప్రకటించింది.  

రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్‌ : సోని 

ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ సోని ఇండియా పండుగల సీజన్‌ నేపథ్యంలో 20 శాతం (రూ.20,000 వరకు) క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తోంది. బ్రేవియా టీవీలు, కెమెరాలు, ప్రీమియం హోమ్‌ ఆడియో ఉత్పత్తులపై మూడేళ్ల వారంటీతోపాటు రూ.1,024 నుంచి నెల వాయిదాలు మొదలవుతాయని కంపెనీ తెలిపింది. ఎంపిక చేసిన ఫుల్‌ ఫ్రేమ్‌ కెమెరా బాడీ, లెన్స్‌ కొను గోలుపై రూ.20,000 డిస్కౌంట్‌ అందుకోవచ్చు.  

చదవండి: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోన్న బెస్ట్‌ డీల్స్‌ ఇవే...!

మరిన్ని వార్తలు