ఫ్లిప్‌కార్ట్ కొత్త వ్యూహం.. వేలాదిమందికి ఉద్యోగాలు!

15 Feb, 2024 20:28 IST|Sakshi

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తాజాగా 'నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (NSDC)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఈ-కామర్స్ సెక్టార్‌లో మాత్రమే కాకుండా బిజినెస్, రిటైల్, వేర్‌హౌసింగ్ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించడానికి యోచిస్తోంది.

ఈ ఒప్పంద కార్యక్రమంలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిష్టర్ 'అతుల్ కుమార్ తివారీ', NSDC COO వేద్ మణి తివారీ పాల్గొన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్ రంగంలో వృత్తిని కొనసాగించాలనుకుని వారికి ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఒప్పందం జరిగింది. 

ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులను నైపుణ్యాలను పెంచుకుంటే.. ఈ కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభతరం అవుతుంది. ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ నిబద్ధతను బలపరుస్తూ.. వేర్‌హౌసింగ్ రంగంలో అభ్యర్థులకు ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కూడా అందిస్తుంది.

ఎంఓయూపై సంతకం చేసిన సందర్భంగా ఎన్‌ఎస్‌డీసీ డైరెక్టర్ వేద్ మణి తివారీ మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పౌరులను ఉద్యోగ నైపుణ్యాలతో సన్నద్ధం చేసేందుకు ఎన్‌ఎస్‌డీసీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఓ ముఖ్యమైన మైలురాయి. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి ఈ-కామర్స్, రిటైల్ అండ్ లాజిస్టిక్స్ రంగాలలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యం కల్పించడం మా లక్ష్యం. ఉద్యోగార్ధులు వారి ఎంపికకు తగిన ఉద్యోగాన్ని పొందటంలో సహాయపడటానికి మేము ఈ కూటమిని దేశం అంతటా తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ 'రజనీష్ కుమార్' మాట్లాడుతూ.. ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్రయాణంలో మిలియన్ల కొద్దీ స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, దేశంలో ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు కట్టుబడి ఉంది. నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC)తో కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు