ఫ్లిప్‌కార్ట్ లో మరో కొత్త సేల్

4 Dec, 2020 14:35 IST|Sakshi

ఫ్లిప్‌కార్ట్‌ పోకో డేస్ పేరుతో కొత్త సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో భాగంగా పోకో ఎక్స్3, పోకో సి3, పోకో ఎం2 మరియు పోకో ఎం2 ప్రోపై డిస్కౌంట్‌ను ఇస్తుంది. పోకో డేస్ సేల్ అనేది నేటి నుండి డిసెంబర్ 6 వరకు ఉంటుంది. పోకో ఎక్స్3ని ఈ సేల్ లో భాగంగా రూ.15,999కే అందిస్తున్నారు. రెండేళ్లపాటు షియోమితో కలిసి ఉండి ఆ తర్వాత వేరుపడి స్వతంత్ర సంస్థగా అవతరించింది పోకో. ఫ్లిప్‌కార్ట్‌లో పోకో డేస్ సేల్లోభాగంగా నాలుగు పోకో ఫోన్‌లపై డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందిస్తుంది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డుపై ఫ్లిప్‌కార్ట్‌ రూ.5000 వరకు తగ్గింపు ఇస్తోంది. యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ బజ్ క్రెడిట్‌ కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. (చదవండి: ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్

పోకో సి3 ఫోన్ యొక్క అసలు ధర 9,999 కాగా ఈ సేల్ భాగంగా 6,999కి అందిస్తున్నారు. ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, లైమ్ గ్రీన్ మరియు మాట్టే బ్లాక్ కలర్లో లభిస్తుంది. పోకో ఎం2 6 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర 12999 కాగా.. 9,999కి అందిస్తున్నారు. అలాగే పొకో ఎం2 ప్రో మొబైల్‌ అసలు ధర రూ. 16,999 నుంచి రూ.12,999కి తగ్గించి విక్రయిస్తున్నారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు. దీనిలో 48 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే పొకో ఎక్స్‌3 మొబైల్‌ అసలు ధర రూ. 19,999 కాగా.. రూ.15,999కే ఈ సేల్‌లో అందిస్తున్నారు. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు. దీనిలో 64 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా