విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్

12 Oct, 2020 14:02 IST|Sakshi

పండుగ వేళ విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్  శుభవార్త

‘లాంచ్‌ప్యాడ్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం  

45  రోజుల పెయిడ్ ఇంటర్న్‌షిప్  కార్యక్రమం

సాక్షి, ముంబై : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్  పండుగ సీజన్ లో అమ్మకాలతో వినియోగదారులకు ఆకట్టుకోవడమే కాదు.. విద్యార్థులకు కూడా శుభవార్త తెలిపింది. దేశంలోని టైర్ 2 సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల16న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాల్లో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చింది.  ఫ్లిప్‌కార్ట్ తాజాగా ప్రకటించిన ‘లాంచ్‌ప్యాడ్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం 45 రోజులు ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు సప్లయి చెయిన్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యాన్ని పొందవచ్చు. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు)

ఈ-కామర్స్ ఇండస్ట్రీలో కస్టమర్లకు సరుకులు డెలివరీ ప్రాసెస్‌ను, క్లిష్టమైన నైపుణ్యాలను విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా తెలుసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి సంక్షోభం మధ్య కీలకంగామారిన ఇకామర్స్ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి లాంచ్‌ప్యాడ్ రూపొందించామనీ, దీర్ఘకాలంలో మంచి అర్హత కలిగిన, బాగా శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన నిపుణులతో తమ సప్లయ్ చెయిన్ వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని  కంపెనీ తెలిపింది. (వివాదంలో ఫ్లిప్‌కార్ట్ : క్షమాపణలు)

ఫ్లిప్‌కార్ట్ ఇందుకోసం 21 ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తోంది. వాటిలో తెలంగాణలోని మేడ్చల్‌, మహారాష్ట్రలోని భివాండి, హర్యానాలోని బినోలా, ఉలుబేరియా, డంకుని (పశ్చిమబెంగాల్), కర్నాటకలోని మలూర్ వంటి ప్రాంతాలున్నాయి. సప్లయి చెయిన్ మేనేజ్‌మెంట్‌ గురించి ఫ్లిప్‌కార్ట్ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యా సేతు యాప్, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లాంటి సంబంధిత కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తామని విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు యువ విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. గత ఏడాది ప్రారంభించిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో 'ది బిగ్ బిలియన్ డేస్ 2019' సందర్భంగా దేశవ్యాప్తంగా 2 వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు శిక్షణ పొందారని  గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు