Union Budget 2022: అందుకే పన్నులను పెంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

1 Feb, 2022 17:11 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌-2022ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  దాదాపు గంటన్నరపాటు బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది. అయితే  పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్‌ మీడియాతో చర్చించారు. ఈ సమావేశంలో క్రిప్టో, టాక్స్‌, డిజిటల్‌ రూపీ తదిరత అంశాలపై మరింత వివరణ ఇచ్చారు. 

అందుకే పెంచలేదు..!
కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రజలపై అదనంగా పన్నుల భారం పెంచే ఉద్ధేశ్యం ప్రభుత్వానికి లేదని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.గత ఏడాది మాదిరిగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిశానిర్దేశంలో పన్నులను పెంచలేదని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజల నుంచి ప్రభుత్వం ఒక్క పైసా కూడా సంపాదించాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ గత ఏడాది బడ్జెట్‌కు సంపూర్ణ ఎజెండా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. 

ఉద్యోగాలపై ప్రభావం..!
కోవిడ్‌-19 రాకతో ఉద్యోగాలపై భారీ ప్రభావమే చూపిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అయితే ఉద్యోగాల విషయంలో ఊరటను కల్పిస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. 

రాహుల్‌ గాంధీకి చురకలు..!
పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంట్‌ సభ్యులు రాహుల్‌ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం ‘జీరో సమ్‌’ బడ్జెట్‌ ప్రకటించిందని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్‌ తిప్పికొట్టారు. బడ్జెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోనే ప్రయత్నం చేయాలని రాహుల్‌కు హితవు పలికారు.

చదవండి: వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది: ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు