రిలయన్స్‌ మరో సంచలనం: గుజరాత్‌లో షురూ

15 Dec, 2022 20:42 IST|Sakshi

సాక్షి,ముంబై ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో సంచలనానికి నాంది పలికింది. ఆయిల్‌ టూ టెలికాం, రీటైల్‌ వ్యాపారంలో దూసుకుపోతున్న రిలయన్స్ తన రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌ పూర్తి  యాజమాన్యంలోని బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతీ అణువులోనూ భారత్‌ అంటూ స్వదేశీ  బ్రాండ్‌  ‘ఇండిపెండెన్స్‌’ ను లాంచ్‌ చేసింది. మేడ్-ఫర్-ఇండియా కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్, ఇండిపెండెన్స్  కింద స్టేపుల్స్,   ప్రాసెస్ చేసిన ఆహారాలు , ఇతర రోజువారీ అవసర సరుకులు సహా అనేక వర్గాల విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తుంది.

ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టబోతున్నామని ప్రకటించిన రిలయన్స్ గ్రూప్ ‘ఇండిపెండెన్స్’ అనే బ్రాండ్ పేరుతో సేవలను గుజరాత్‌లో గురువారం ప్రారంభించింది.  రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ద్వారా  ఈ సేవలను లాంచ్‌ చేసింది.    రాబోయే నెలల్లో ఇండిపెండెన్స్ బ్రాండ్‌ను విస్తరించాలని , గుజరాత్ వెలుపలి రిటైలర్లను చేర్చాలని యోచిస్తోంది. 

ఎడిబుల్ ఆయిల్, పప్పులు, తృణ ధాన్యాలు, బిస్కట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ తదితర  నిత్యావసర వస్తువులను నాణ్యమైన, సరసమైన ధరలకు సరఫరా చేయనున్నామని కంపెనీ ప్రకటించింది. ఇండిపెండెన్స్ బ్రాండ్ కింద ఎఫ్‌ఎంసీజీ సేవలను లాంచ్‌ చేయడం సంతోషంగా ఉందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వెంచర్స్ లిమిటెడ్ బ్రాండ్‌ను  తీసుకొచ్చారు. గుజరాత్‌ను ‘గో టు మార్కెట్‌’ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు  కంపెనీ తెలిపింది. 

కాగా బిలియనీర్‌ ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ FY22లో కంపెనీ అమ్మకాలు, సేవల విలువ రూ.1,99,749 కోట్లును సాధించి  తద్వారా మార్కెట్‌  విలువ రూ.2 ట్రిలియన్లకు చేరింది. అనుబంధ సంస్థల ద్వారా, రిలయన్స్ రిటైల్ 16,500 కంటే ఎక్కువ సొంత దుకాణాలను నిర్వహిస్తోంది.  కిరాణా, ఎలక్ట్రానిక్స్, అపెరల్, ఫార్మసీ, లోదుస్తులు, ఇల్లు , ఫర్నిషింగ్, బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ సంరక్షణలో 2 మిలియన్లకు పైగా వ్యాపారులతో భాగస్వాములను కలిగి ఉంది.

మరిన్ని వార్తలు