తీవ్రమైన ఒత్తిడిలో కంపెనీలు..సామాన్యుడిపై బాంబు వేసేందుకు సిద్ధం..! వీటి ధరల​కు రెక్కలు

20 Mar, 2022 15:02 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ప్రభావంతో ఒక్కసారిగా వంటనూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే వంటనూనె ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా అధిక ద్రవ్యోల్భణ పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) కంపెనీలు సామాన్యుడిపై ధరల పెంపు బాంబును వేసేందుకు సిద్దమైన్నట్లు తెలుస్తోంది.

తీవ్రమైన ఒత్తిడి..!
గోధుమ, వంటనూనె, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ వంటి వస్తువుల ధరలు మరొక సారి భారీగా పెరగనున్నాయి. అధిక ద్రవ్యోల్భణ ప్రభావాన్ని అధిగమించడానికి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ధరల పెంపును యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సామాన్యులు తమ రోజువారీ నిత్యావసర వస్తువుల కోసం మరింత చెల్లించే పరిస్థితులు త్వరలోనే రానున్నాయి. ఇదిలా ఉండగా రష్యా-ఉక్రెయిన్‌ యుధ్ద పరిస్థితులు నిత్యావసర వస్తువుల పెంపుకు అనివార్యమైందని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. 

అధిగమించాలంటే..!
ప్రస్తుత పరిస్థితిని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలైన డాబర్,పార్లే వంటి కంపెనీలు  గమనిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడానికి ధరలు పెంపుకు సవరణలను చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం...గత వారం హెచ్‌యూఎల్‌(హిందుస్తాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌), నెస్లే వంటి సంస్థలు  ఆహార ఉత్పత్తుల ధరలను భారీగా పెంచారు. ద్రవ్యోల్భణ పరిస్థితుల నుంచి కంపెనీలను కాపాడేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కనీసం 10 నుంచి 15 మేర పెంపు ఉండే అవకాశం ఉంటుందని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా పిటిఐకి చెప్పారు. 

అస్థిరత..!
గత కొద్ది రోజులుగా నిత్యావసర వస్తువుల ధరల్లో అధిక హెచ్చుతగ్గులు ఉన్నట్లు షా తెలిపారు. అయితే ధరల అస్థిరత కారణంగా కచ్చితమైన పెరుగుదల గురించి చెప్పడం అంతా సులువుకాదని ఆయన పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో ఒక్కసారిగా క్రూడాయిల్‌ ధరలు ఏకంగా 140 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ తిగమనం పట్టాయని మయాంక్‌ షా గుర్తుచేశారు. ఒకానొక సమయంలో లీటర్‌ పామాయిల్‌ ధర రూ. 180కు పెరిగి ప్రస్తుతం రూ. 150కి పడిపోయింది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సుమారు 10 నుంచి 15 శాతం నిత్యవసర వస్తువుల ధరలను పెంచాలనే ప్రతిపాదనలతో ఉన్నట్లు తెలిపారు. ఇన్‌పుట్‌ ఖర్చులను తగ్గించేందుకుగాను ధరల పెంపుకు సిద్దమైనట్లు షా అన్నారు. 

చదవండి: మందగమనంలో ఎఫ్‌ఎంసీజీ!

మరిన్ని వార్తలు