కరోనా ఎఫెక్ట్: హెల్త్‌, హైజీన్‌ ఉత్పత్తులకు డిమాండ్‌

22 Apr, 2021 14:20 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్‌, హైజీన్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. శానిటైజర్లు, క్రిమిసంహారకాలు, చేతులు కడిగేందుకు వాడే లిక్విడ్స్‌ అమ్మకాలు అధికముయ్యాయని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని ఐటీసీ, హిమాలయ డ్రగ్స్‌, పతంజలి తెలిపాయి. రెండు మూడు నెలల క్రితం వీటి వాడకం తగ్గింది. కోవిడ్‌-19 కేసులు పెరగడంతో ప్రస్తుతం పరిస్థితులు మారాయి. తమ హైజీన్‌ ఉత్పత్తులకు విపరీత డిమాండ్‌ వచ్చిందని ఐటీసీ పర్సనల్‌ కేర్‌ విభాగం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమీర్‌ సతీపతి తెలిపారు. 

సామర్జ్యాలను పెంచామని హిమాలయ డ్రగ్‌ కంపెనీ కరిన్దూమర్‌ ప్రొడక్ట్స్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ కృష్ణమూర్తి వెల్లడించారు. డిమాండ్‌ అమాంతం పెరగడంతో సరఫరా విషయంలో అవాంతరాలు ఎదుర్కొన్నట్టు పతంజలి తెలిపింది. అయితే ఇది తాత్కాలికమేనని, ఉత్పత్తులను క్రమబద్దీకరించామని సంస్థ ప్రతినిధి ఎస్‌.క.తిజారావాలా వివరించారు. ఎవరూ ఊహించని విధంగా కోవిడ్‌ కేసులు పెరిగాయని అన్నారు. సబ్బులు, మాస్కులు, క్లీనింగ్‌ ఉత్పత్తుల వంటి హైజీన్‌ ప్రొడక్ట్స్‌ డిమాండ్‌ అధికమైంది. కోవిడ్‌-19 కేసులు వచ్చిన తొలి నాలుగు నెలల్లో శానిటైజర్ల కోసం జనం ఎగబడ్డారు. దీంతో మద్యం, పెయింట్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు దీని తయార్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి.

చదవండి: కొత్తగా బ్యాంక్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్

>
మరిన్ని వార్తలు