ఫ్యూచర్‌ ఫోన్లు ఇవే..చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!

24 Oct, 2023 18:00 IST|Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్‌ రూపురేఖలు మారుతున్నాయి. 1973లో మార్టిన్‌కూపర్‌ ఆవిష్కరించిన డబ్బా ఆకారంలో ఉండే మొదటి సెల్యులర్‌ ఫోన్‌ బరువు అక్షరాల 790గ్రాములు. అయితే రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో వాటి ఆవిష్కరణలు అగ్రస్థానాన్ని తాకాయి. ప్రత్యేకించి మొబైల్‌ తయారీరంగంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. బరువు తక్కువగా ఉండే మొబైల్‌లు గతంలో ఆదరణ పొందేవి. ఇప్పడు ఫోల్డబుల్‌ ఫోన్లపై ఆసక్తి ఎక్కువవుతుంది. అయితే కంపెనీలు ఇంకా అడ్వాన్స్‌గా ఆలోచించి మడిచేఫోన్లను తయారు చేయనున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి.

(ఇదీ చదవండి: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత)

మరిన్ని వార్తలు