రెండింతలైన అగ్రిటెక్‌ పెట్టుబడులు.. కారణం ఏంటంటే!

1 Dec, 2022 19:33 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వ్యవసాయం, ఆహార రంగంలో ఉన్న సాంకేతిక స్టార్టప్స్‌లో పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో రెండింతలకుపైగా పెరిగి రూ.37,425 కోట్లకు చేరాయి. 2020–21తో పోలిస్తే 119 శాతం వృద్ధి నమోదైంది. రెస్టారెంట్‌ మార్కెట్‌ప్లేస్, ఈ–గ్రాసరీ విభాగాల్లో పెట్టుబడుల వరద ఈ స్థాయి జోరుకు కారణమని ఇండియా అగ్రిఫుడ్‌టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిపోర్ట్‌–2022 పేరుతో వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీలైన ఆగ్‌ఫండర్, ఓమ్నివోర్‌ రూపొందించిన నివేదిక వెల్లడించింది.

డీల్స్‌ సంఖ్య 189 నుంచి 234కు చేరింది. రెస్టారెంట్‌ మార్కెట్‌ప్లేస్‌ రూ.15,458 కోట్లు, ఈ–గ్రాసరీ విభాగం రూ.11,390 కోట్ల నిధులను అందుకున్నాయి. పరిశ్రమ చేజిక్కించుకున్న నిధుల్లో ఈ రెండు విభాగాల వాటా ఏకంగా 66 శాతముంది. వ్యవసాయ సాంకేతిక రంగ స్టార్టప్స్‌ 140 డీల్స్‌కుగాను రూ.12,204 కోట్లు చేజిక్కించుకున్నాయి. ఆసియా పసిఫిక్‌ దేశాల్లో అత్యధికంగా పెట్టుబడులను భారత్‌ ఆకట్టుకుంది.

చదవండి: అలర్ట్‌: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్‌!

మరిన్ని వార్తలు