బాలీవుడ్‌ స్టార్‌ బిల్డింగ్‌లో సూపర్‌మార్కెట్‌: నెలకు అద్దె ఎంతో తెలుసా?

26 Sep, 2023 13:57 IST|Sakshi

  బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ బిల్డిండ్‌ లీజ్‌

ఫుడ్‌ హాల్‌ ఔట్‌..ఫుడ్ స్క్వేర్ ఇన్‌ 

ముంబైలోని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు చెందిన  ఇంటిని  IIT గ్రాడ్యుయేట్లు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ముంబైలోని శాంతాక్రూజ్ పరిసరాల్లో సల్మాన్ నాలుగంతస్తుల కమర్షియల్‌ బిల్డింగ్‌లో "ఫుడ్ స్క్వేర్" అనే సూపర్‌ మార్కెట్‌ కొలువు దీరింది. మయాంక్ గుప్తా, లలిత్ ఝవార్ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లు దీన్ని షురూ చేశారు.  

మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం లీజుకు తీసుకున్న 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లకు గాను నెలకు అద్దె  రూ. 90 లక్షలు.  తొలి  12 నెలలకు అద్దె రూ. 90 లక్షలు. ఏడాది తర్వాత రూ. 1 కోటికి పెరుగుతుందని భవిష్యత్తులో మరింత పెరగవచ్చని తెలుస్తోంది. స్వయంగా రైతులమైన తమకు గత ఐదేళ్లకు పైగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆక్వాపోనిక్స్, స్థిరమైన నేల ఆధారిత వ్యవసాయ క్షేత్రాలను నిర్వహిస్తున్న అనుభవం ఉందని ఫుడ్ స్క్వేర్ జనరల్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు మయాంక్ గుప్తా తెలిపారు. "ఫుడ్ స్క్వేర్" ప్రపంచం నలుమూలల నుండి పండ్లు, కూరగాయలను అందిస్తుంది, 350 రకాల చీజ్‌లను కూడా అందిస్తుంది. గుప్తా, ఝవార్ 2019లో భారతదేశంలోని కొల్హాపూర్‌లో "ల్యాండ్‌క్రాఫ్ట్ ఆగ్రో"ని స్థాపించగా ఇప్పటివరకు 3.6 మిలియన్ల పెట్టుబడులను సాధించగలిగారు.

2012లో దాదాపు రూ. 120 కోట్లతో ఆస్తిని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో దీన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుల్‌హాల్‌కు జూలై 2017లో లీజుకు ఇచ్చారు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ఈ రిటైల్ చైన్ ఫుడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ సల్మాన్‌కు కూడా రూ.2.40 కోట్లు బకాయిపడింది. దీంతో  తమ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో సల్మాన్‌ఖు అనుకూలంగా తీర్పు రావడంతో కొన్ని నెలల క్రితం ఫుడ్ హాల్ ఖాళీ చేసింది. ఇప్పుడు  ఈ స్థానంలో ఫుడ్ స్క్వేర్‌ ఈ స్థానంలో చేరింది.

 సల్మాన్‌ ఖాన్‌ నికర విలువ 
పలు నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ నికర విలువ 2850 కోట్లు. సినిమాలతోపాటు, సల్మాన్ పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కోట్లాది రూపాయిలు ఆర్జిస్తాడు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ.6 నుంచి 7 కోట్లు వసూలు చేస్తాడు. వార్షిక సంపాదన దాదాపు రూ.220 కోట్లు. ఆదాయం నెలకు 16 కోట్లు. సల్మాన్‌కు ముంబైలో ఆస్తి ఉండటమే కాకుండా దుబాయ్‌లో కోట్లాది రూపాయల ఆస్తి  ఉన్న సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు