Forbes100 Most Powerful Women ఫీట్‌ రిపీట్‌ చేసిన నిర్మలా సీతారామన్‌ 

7 Dec, 2022 21:49 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి తన ఫీట్‌ను రిపీట్‌ చేశారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక గ్లోబల్‌ టాప్-100 శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మల మరోసారి చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకున్నారు. ఈమెతోపాటు ఆరుగురు భారతీయ మహిళలుకూడా ఉన్నారు.  (సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ టెక్నో పోవా-4: ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి!)

2022 ఫోర్బ్స్ లిస్టులో  సీతారామన్  36వ స్థానంలో నిలిచారు. 2021లో మంత్రి జాబితాలో 37వ స్థానంలో  2020లో 41వ స్థానంలోనూ, 2019లో 34వ స్థానంలోనూ ఉన్నారు. ఇంకా హెచ్‌సిఎల్‌టెక్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా 53 ర్యాంకు సాధించారు. సెబీ  తొలి చైర్‌పర్సన్ మధాబి పూరి బుచ్  54, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమా మోండల్ 67ను స్థానంలో నిలిచారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా 72వ ప్లేస్‌ను, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ 89వ ప్లేస్‌లోనూ నిలిచారు.   (ట్రేడర్లకు గుడ్‌ న్యూస్‌: ఆర్బీఐ కీలక నిర్ణయం)

కాగా ఫోర్బ్స్ టాప్-100 మోస్ట్ పవర్ ఫుల్ మహిళల జాబితాలో యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ టాప్‌ ప్లేస్‌ కొట్టేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి నేత కమలా హ్యారిస్ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలవడం విశేషం. 100వ ర్యాంక్‌లో, ఇరాన్‌కు చెందిన జినా "మహ్సా" అమిని మరణానంతరం ప్రభావవంతమైన జాబితాలో చేరారు. సెప్టెంబరులో ఆమె మరణం ఇస్లామిక్ దేశంలో హక్కుల కోసం అపూర్వమైన మహిళల నేతృత్వంలోని విప్లవానికి దారితీసింది. జాబితాలో 39 మంది సీఈవోలు, 10 దేశాధినేతలు,11 బిలియనీర్లు ఉన్నారని వీరిసంపద సంయుక్తంగా 115 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ ప్రకటించింది. 
 

మరిన్ని వార్తలు