ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల కారును లాంచ్ చేసిన ఫోర్డ్

22 Jul, 2021 15:17 IST|Sakshi

ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల ఫిగో కారును ఫోర్డ్ నేడు(జూలై 22) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర ₹7.75 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఫోర్డ్‌ఫిగో ఆటోమేటిక్ కారు మిడ్-స్పెక్ టైటానియం, టైటానియం ప్లస్ ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. ఫోర్డ్ సబ్ కాంపాక్ట్ ఎస్యువీ ఎకోస్పోర్ట్ లో ఉపయోగించిన గేర్ బాక్స్ ఇందులో వాడారు. దీనిలో గల ఇంజిన్ గరిష్ఠంగా 95 బిహెచ్ పీ పవర్, 119 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో మరింత పెప్పీ డ్రైవింగ్ అనుభవం కోసం 'స్పోర్ట్' మోడ్ ను అందించారు. 

ఫోర్డ్‌ ఫిగో ఆటోమేటిక్ కారు 16 కి.మీ.పీ.ఎల్(ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఫిగో హ్యాచ్ బ్యాక్స్ డీజిల్ వేరియెంట్లకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ లభించదు. రెగ్యులర్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఎప్పటిలాగే ఫిగో ఇతర వేరియెంట్లలో కొనసాగుతుంది. 2021 ఫిగో ఆటోమేటిక్ కొత్త డ్యూయల్ టోన్ 15 అంగుళాల అలాయ్ వీల్స్ తో రీడిజైన్ చేయబడ్డాయి. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే కొత్త ఫిగో ఆటోమేటిక్ 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్ లు, రిమోట్ కీలెస్ వంటివి ఉన్నాయి. భద్రతా కోసం ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఈబీడీతో ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-లాంచ్ అసిస్ట్ లను పొందుతుంది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు