‘ఆ సువాసన’ వెదజల్లే కారు... ప్రపంచంలోనే మొదటి సారి

19 Jul, 2021 15:56 IST|Sakshi

FORD MUSTANG MACH-E ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. వాహనాల తయారీలో ఉన్న కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్నాయి. ఎక్కువ కంపెనీలు ఛార్జింగ్‌, మైలేజీపై దృష్టి సారించగా... ఫోర్డ్‌ ఓ అడుగు ముందుకు వేసి సరికొత్త ఫీచర్‌తో కస్టమర్లను ఆకట్టుకోవాలని ప్లాన్‌ వేసింది. 

ఆ ఫీలే వేరు
ఇంతకాలం పెట్రోలు, డీజిల్‌ కార్లదే హవా నడిచింది. ఏళ్ల తరబడి పెట్రోలు కార్లు ఉపయోగించాం. దీంతో ఆ కార్లతో తెలియకుండానే ఒక అనుబంధం ఏర్పడింది. పైకి ఎవరు చెప్పకున్నా కారుకు సంబంధించి కంఫర్ట్‌, కంపాటబులిటీలతో పాటు పెట్రోల్‌ ఇంజన్‌ వాసనను కూడా ఫీల్‌ అయ్యేవారు చాలా మంది ఉంటారు. అయితే కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఈ అనుభూతి మిస్‌ అవుతుందని చాలా మంది ఫీల్‌ అవుతున్నారు. 

వాసన మిస్‌ అవుతున్నాం
పెట్రోల్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారిన తర్వాత పెట్రోలు వాసనను మిస్‌ అవుతున్నామని  70 శాతం మంది తెలిపినట్టు ఫోర్డ్‌ జరిపిన సర్వేలో తేలింది, వైన్‌, ఛీజ్‌ కంటే కూడా పెట్రోలు వాసనే ఎక్కువ ఇష్టపడతామని చెప్పిన వారి సంఖ్య కూడా చాంతాడంత తేలింది.  

తొలిసారిగా
దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాలు కార్లు ఉపయోగించే వారికి పెట్రోలు కారు స్మెల్‌ ఫీల్‌ మిస్‌ కాకుండా ఉండేందుకు ప్రత్యేక మాక్‌ ఈవ్‌ పేరుతో సరికొత్త ఫ్రాగ్రెన్స్‌ని తయారు చేసింది ఫోర్డ్‌. ప్రత్యేక పద్దతిలో తయారు చేసిన ఈ పరిమళాన్ని మొదటగా ఫోర్డ్‌ ముస్టాంగ్‌ మాక్‌ ఈ-జీటీ మోడల్‌తో ప్రవేశ పెట్టనుంది. పెట్రోలు వాసన మిస్‌ అవుతున్న వారికి ప్రత్యామ్నయం చూపనుంది. పెట్రోల్‌ వాసన అందించే తొలి ఈవీ కారుగా ఫోర్డ్‌ ముస్టాంగ్‌  మాక్‌ - ఈ జీటీ నిలవనుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు