భారత్‌లో ఫోర్డ్‌, అమ్మో ఇన్ని వేల కోట్లు నష్టపోయిందా!

16 May, 2022 21:31 IST|Sakshi

వాహన రంగంలో ఉన్న యూఎస్‌ సంస్థ ఫోర్డ్‌.. ఎగుమతుల కోసం  భారత్‌లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ తయారీ ప్రణాళికను విరమించుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద అనుమతి పొందినప్పటికీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

చెన్నై, గుజరాత్‌లోని సనంద్‌ ప్లాంట్లలో ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో వాహనాల తయారీని నిలిపివేస్తున్నట్టు ఫోర్డ్‌ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో తయారైన వెహికిల్స్‌ను మాత్రమే దేశంలో విక్రయించాలని నిర్ణయించింది. 

భారత్‌లోని ప్లాంట్ల కోసం ఫోర్డ్‌ సుమా రు రూ.19,250 కోట్లు వెచ్చించింది. అయితే కంపెనీ రూ.15,400 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. విదేశీ మార్కెట్ల కోసం సనంద్‌ ప్లాంటులో ఇంజన్ల తయారీ కొనసాగుతోంది. రెండు తయారీ కేంద్రాలను విక్రయించాలని కంపెనీ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది.  

మరిన్ని వార్తలు