ప్చ్‌..అధ్వాన్నంగా భారతీయ బ్యాంకుల్లో మొబైల్‌ యాప్స్‌ సేవలు!

31 Aug, 2022 15:22 IST|Sakshi

భారత్‌కు చెందిన బ్యాంకులు కస్టమర్లకు మొబైల్‌ సర్వీసుల్ని అందించడంలో విఫలమవుతున్నాయి. కస్టమర్‌ల ఖర్చుల్ని, అప్పుల్ని అర్థం చేసుకోవడం, ఉపయోగకరమైన బడ్జెట్‌లను రూపొందించడం, ఆర్ధిక వృద్ధి సాధించేలా సలహాలు ఇవ్వడం, వారి ఆర్థిక స్థితుల్ని ట్రాక్‌ చేయడంలో బ్యాంకుల పనితీరు సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది.  

గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ ఫర్‌ రెస్టర్‌..మనీ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలలో దేశీయ బ్యాంకులకు అత్యల్ప స్కోర్‌ను ఇచ్చింది. తాజా క్యూ3లో  మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు అందించే ఏ బ్యాంక్‌కు కూడా 60శాతం మించి స్కోర్‌ ఇవ్వలేదు. అందుకు కారణం బ్యాంకులు కస్టమర్లకు అందించే సర్వీసులపై అసంతృప్తి వ్యక్తం చేయడమేనని తెలుస్తోంది.  

బ్యాంకుల్లో నావిగేషన్‌ బాగున‍్నప్పటికీ యాప్స్‌లో సెర్చ్‌ బార్‌లో సమస్యలు ఉత‍్పన్నం అవుతున్నాయని, ముఖ్యంగా వినియోగదారులు చేసిన ట్రాన్సాక్షన్‌లను గుర్తించేలా యాప్‌లో సులభమైన పద్దతులు లేవని ఫర్‌ రెస్టర్‌ తెలిపింది. దీంతో పాటు బ్యాంకులు గోప్యతా విధానాన్ని ప్రదర్శిస్తున్నాయి.

వారి సమస్యల పరిష్కారం కోసం బ్యాంకులు పబ్లిష్‌ చేసే ఆర్టికల్స్‌ సామాన్యులకు అర్ధం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. "చాలా బ్యాంకులు యాప్స్‌ను బిల్డ్‌ చేయడంలో రాజీ పడడం లేదు. మంచి విషయమే. మొబైల్‌ బ్యాకింగ్‌ వ్యవస్థతో యూజర్లకు ఉపయోగం, సులభంగా ఉంటుంది. తద్వారా బ్యాంకుల్ని వినియోగించేందుకు మక్కువ చూపుతారని పేర్కొంది.

మరిన్ని వార్తలు