నైకాలో నాలుగు సంస్థల షేర్ల విక్రయం

12 Nov, 2022 08:22 IST|Sakshi

న్యూఢిల్లీ: లాకిన్‌ వ్యవధి ముగిసిన నేపథ్యంలో బ్యూటీ ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాం నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ–కామర్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన నాలుగు సంస్థలు ఓపెన్‌ మార్కెట్‌లో షేర్లను విక్రయించాయి. తద్వారా రూ. 693 కోట్లు సమీకరించాయి. లైట్‌హౌస్‌ ఇండియా ఫండ్‌ త్రీ, మాలా గోపాల్‌ గావ్‌కర్, నరోత్తమ్‌ షఖ్సారియా 2.84 కోట్ల షేర్లను రూ. 491.35 కోట్లకు విక్రయించారు.

షేరు ఒక్కింటికి రూ. 171.75–173.70 రేటు చొప్పున విక్రయించగా సెగంటీ ఇండియా మారిషస్, నార్జెస్‌ బ్యాంక్, అబర్డీన్‌ స్టాండర్డ్‌ సంస్థలు కొనుగోలు చేశాయి. అటు టీపీజీ గ్రోత్‌ 4 ఎస్‌ఎఫ్‌ రెండు విడతల్లో రూ. 202 కోట్లకు మొత్తం 1.08 కోట్ల షేర్లను విక్రయించింది. షేరు ఒక్కింటికి రూ. 186.4 రేటుతో అమ్మగా సొసైటీ జనరల్, మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా (సింగపూర్‌) కొనుగోలు చేశాయి. శుక్రవారం ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ–కామర్స్‌ వెంచర్స్‌ షేరు 10 శాతం పెరిగి రూ. 208 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు