అయ్యయ్యో ఐఫోన్‌14: ఫాక్స్‌కాన్‌కు భారీ షాక్‌, 20వేలమంది పరార్‌!

25 Nov, 2022 12:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ల ఉత్పత్తిదారు భారీ చిక్కుల్లో పడింది. చైనాలోని ఫాక్స్‌కాన్ జెంగ్‌జౌ ప్లాంట్ మరిన్ని కష్టాల్లో కూరుకుపోతోంది.  ఒకవైపు మళ్లీ  రికార్డు స్థాయిలో విజృంభిస్తున్న కరోనా, లాక్‌డౌన్‌, ఆంక్షలకు తోడు 20వేల మందికి పైగా ఉద్యోగులు కంపెనీనుంచి పారిపోవడంతో ఐఫోన్ల ఉత్పత్తి అగమ్యగోచరంలో పడింది. దీంతో యాపిల్‌ ఐఫోన్‌ 14 సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురు కానుంది. 

పైగా వీరంతా దాదాపు కొత్తవారే.. అధిక జీతాలు, బోనస్‌లో ఆఫర్‌ చేసిన తీసుకున్న వారే కావడం గమనార్హం. 10వేల యువాన్‌లను (1,396డాలర్లను) తీసుకొని గందరగోళంలో ఉన్న ప్లాంట్‌ను విడిచి పెట్టాలనుకునే ఉద్యోగులకు ఆఫర్‌ చేసిన తర్వాత ఈపరిణామం చోసుకుంది. ఇప్పటికే ఐఫోన్‌ల ఉత్పత్తి క్షీణించవచ్చనే అంచానల మధ్య తాజా సంఘటనతో నవంబరు షిప్‌మెంట్స్‌ 30 శాతానికి పైగా పడిపోతాయనే వార్తలపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఫాక్స్‌కాన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. 

సంవత్సరాంతపు సెలవుల సీజన్‌కు ముందు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు సాధారణంగా బిజీగా ఉండాల్సిన తరుణంలో ఈ పరిణామాలు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తిపై భారీ  ప్రభావం చూపిస్తాయని  ప్రధానంగా యాపిల్‌ లాంటి సంస్థలకు తీవ్ర దెబ్బ అని  మార్కెట్‌ నిపుణులుఅంచనా వేస్తున్నారు. అలాగే తాజాగా ఉద్యోగుల నిష్క్రణలుతో నవంబర్ చివరి నాటికి పూర్తి ఉత్పత్తిని పునఃప్రారంభించాలనే కంపెనీ లక్క్క్ష్యానికి ఇది విఘాతమేనని పేర్కొన్నారు.  ప్రప్రపంచవ్యాప్తంగా 70శాతం ఐఫోన్ షిప్‌మెంట్‌లను ఇక్కడినుంచే ఉత్పత్తి చేస్తోంది. ఫాక్స్‌కాన్ ఈ నెల ప్రారంభంలో బోనస్‌లు, అధిక జీతాలను అందజేస్తూ హైరింగ్ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయినా ఫలితం దక్కడం లేదు.

మరోవైపు  ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో జీరో కోవిడ్‌ పేరుతో విధించిన ఆంక్షలు ఉద్యోగుల్లో అసహనాన్ని రగిలించాయి. దీంతో  విసుగెత్తిన ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగడంతో హింస చెలరేగింది. సరైన వసతులు కల్పించడంలేదని, జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు  ఆవేదన  వ్యక్తం చేశారు. దీనిపై ఫాక్స్‌కాన్‌ కంపెనీ క్షమాపణలు కూడా తెలిపిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు