అదానీ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు

20 Mar, 2023 06:19 IST|Sakshi

రూ. 15,446 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌

ఇతర స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు

న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇటీవల అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రూ. 15,446 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడంతో మార్చిలో పెట్టుబడులు లభించినట్లు నమోదైంది. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. అదానీ గ్రూప్‌లో యూఎస్‌ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ పెట్టుబడులను(రూ. 15,446 కోట్లు) మినహాయిస్తే దాదాపు రూ. 4,000 కోట్లమేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

యూఎస్‌లో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్‌ బ్యాంక్‌ విఫలంకావడంతో ఇకపై విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు మార్చి 1–17 కాలంలో రూ. 11,495 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 5,294 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, జనవరిలో మరింత అధికంగా రూ. 28,852 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే 2022 డిసెంబర్‌లో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు