నెంబర్‌వన్‌ బ్రాండ్‌గా ఫ్రీడమ్‌ రిఫైండ్‌ 

27 Jun, 2022 13:12 IST|Sakshi

హైదరాబాద్‌: సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ విభాగం అమ్మకాల్లో ‘ఫ్రీడమ్‌’ రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దేశంలోనే అగ్రగామి బ్రాండ్‌గా నిలిచింది. రాజీలేని నాణ్యత, ఉత్పత్తిలో స్థిరత్వం, విస్తృతస్థాయి పంపిణీ నెట్‌వర్క్, ఫ్రీడమ్‌ బ్రాండ్ల పట్ల కస్టమర్లకు ఉన్న నమ్మకంతోనే ఈ ఘనత సాధించినట్లు కంపెనీ తెలిపింది.

‘‘సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ విభాగపు మార్కెట్లో 20.5శాతం వాటాను సొంతం చేసుకొని దేశంలోనే నెంబర్‌ వన్‌ బ్రాండ్‌గా నిలువడం సంతోషంగా ఉంది’’ అని జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ప్రదీప్‌ చౌదరి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఫ్రీడమ్‌ బ్రాండ్‌ను దేశమంతా విస్తరించేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గత దశాబ్ద కాలంగా కస్టమర్లు చూపుతున్న విశ్వాసం, అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి ఆయిల్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ శ్రీ పీ చంద్రశేఖర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.  

మరిన్ని వార్తలు