వరల్డ్‌ వైడ్‌గా ‘పనిమంతులు’ ఏ దేశాల్లో ఉన్నారో తెలుసా?

24 Jan, 2023 07:37 IST|Sakshi

ప్రపంచ దేశాలకు చెందిన ఉద్యోగులతో పోల్చుకుంటే అమెరికన్ ఉద్యోగులు ‘హస్టిల్ కల్చర్’లో ప్రాచుర్యం పొందుతుంటే ఫ్రెంచ్ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ పనిగంటలు చేస్తున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. 

గ్లోబల్‌లో సగటున 25శాతంతో ప్రతి పదిమంది ఫ్రెంచ్‌ బిజినెస్‌ లీడర్స్‌లో నలుగురు ఆఫీస్‌ వర్క్‌ చేసే సమయంలో ఎలాంటి బ్రేకులు తీసుకోకుండా గంటల తరబడి పని చేస్తున్నారు. యూఎస్‌,యూకే, చైనా దేశాలకు చెందిన ఉద్యోగులు సైతం పని విషయంలో మంచి రేటింగ్‌ పొందుతున్నట్లు సర్వే నిర్వహించిన హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ సంస్థ బుపా గ్లోబల్ ఫండ్‌ తెలిపింది.  

పనిమంతులే.. కానీ భయం ఎక్కువే!
అదే సమయంలో ఏ దేశంలో సర్వే చేసిన ..ఆయా దేశాల్లో ఫ్రెంచ్ ఎగ్జిక్యూటివ్‌లు వారి వ్యక్తిగత పని పనితీరు గురించి ఆందోళన చెందుతున్నట్లు తేలింది. అందుకు ప్రస్తుత ఆర్థిక అస్థిరతను ఎదుర్కొనేందుకు వారి సంస్థల సామర్థ్యం గురించి ఆందోళనలు, ఇతర దేశాలకు చెందిన తరహాలో ఉద్యోగులు రిమోట్‌ వర్క్‌ చేసేందుకు ఇష్టపడకపోవడం వంటి అంశాలు ఉన్నాయని సర్వేలో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా..ఆర్థిక ఒత్తిళ్లు, బాధ్యతలు స్వీకరించే ధోరణి కారణంగా ఫ్రెంచ్ ఎగ్జిక్యూటివ్‌లు ఎక్కువ గంటలు పనిచేయడానికి దోహదపడుతుంది" అని బుపా గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంథోనీ కాబ్రెల్లి అన్నారు.

ఆశ్చర్యం కలుగక మానదు
ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఆఫీసుల్లో అమలు చేస్తున్న పాలసీలు, జీవనశైలి గురించి వింటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇక ఆదేశంలో చాలా మంది కన్‌స్ట్రక్షన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌,ఆయిల్‌ ఫీల్డ్‌ వర్క్‌ వంటి బ్లూ కాలర్ జాబ్స్‌, ఫుడ్‌ సర్వీస్‌,క్లీన్‌ సర్వీస్‌, పర్సల్‌ సర్వీస్‌ వంటి సర్వీస్ ఉద్యోగులు వారంలో 35 గంటల పని చేస్తున్నారు. వేసవి సెలవులు ఉన్న ఆగస్ట్‌ నెలలో ఎక్కువ గంటలు ఆఫీస్‌ పనికే కేటాయిస్తున్నారు.  

రైట్‌ టూ డిస్‌ కనెక్ట్‌
2017లో ఫ్రాన్స్‌ దేశం రైట్‌ టూ డిస్‌ కనెక్ట్‌ అనే చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టంలో నిర్దిష్ట గంటల తర్వాత ఇంటికి వెళ్లిన ఉద్యోగులకు ఇమెయిల్స్‌, కాల్స్‌ చేయడం నిషేధించాలని సంస్థలు కోరాయి. మహమ్మారి సమయంలో రిమోట్ వర్క్‌ చేసేలా ప్రతిపాదనలు తెచ్చేలా ఇతర దేశాలను ప్రేరేపించింది. కాగా, కొన్నేళ్లుగా ఫ్రెంచ్ లేబర్ కోడ్ ప్రకారం ఎవరైనా తమ డెస్క్‌ల వద్ద భోజనం చేయడం నిషేధం.. అయినప్పటికీ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో చట్టాన్ని నిషేధించారు.

మరిన్ని వార్తలు