ఫ్రెష్‌టుహోమ్‌ 104 మిలియన్‌ డాలర్ల సమీకరణ

23 Feb, 2023 05:46 IST|Sakshi

న్యూఢిల్లీ: మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించే స్టార్టప్‌ సంస్థ ఫ్రెష్‌టుహోమ్‌ తాజాగా రూ. 104 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 861 కోట్లు) సమీకరించింది. అమెజాన్‌ ఎస్‌ఎంభవ్‌ వెంచర్‌ ఫండ్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన ఈ నిధులను వ్యాపార విస్తరణ కోసం వినియోగించుకోనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో 100 భౌతిక రిటైల్‌ స్టోర్స్‌ను ప్రారంభించనుంది. 2015లో బెంగళూరు కేంద్రంగా ఫ్రెష్‌టుహోమ్‌ కార్యకలాపాలు ప్రారంభించింది.

ప్రస్తుతం దేశీయంగా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో 160 పైగా నగరాల్లోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 250 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించినట్లు సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు షాన్‌ కడవిల్‌ తెలిపారు. ప్రస్తుతం 30 రిటైల్‌ స్టోర్స్‌ ఉండగా వచ్చే 12 నెలల్లో వీటిని 130కి పెంచుకోనున్నట్లు వివరించారు. అటు సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లోనూ విస్తరించనున్నట్లు తెలిపారు. 2025 ఆఖరు నాటికి ఐపీవోకి (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వచ్చే యోచనలో ఉన్నట్లు కడవిల్‌ చెప్పారు. ప్రస్తుతం తమ వార్షికాదాయం దాదాపు రూ. 1,100 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.  

మరిన్ని వార్తలు