భారత్‌కు రష్యా ఓపెన్‌ ఆఫర్‌, డిస్కౌంట్‌లో ఆయిల్‌ కొంటే తప్పేంటట!

2 Apr, 2022 14:07 IST|Sakshi

రష్యా నుంచి భారత్‌  ముడి చమురును కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోళ్లు అమెరికాతో పాటు పలు మిత్ర దేశాలకు మింగుడు పడడం లేదు. అందుకే తమని కాదని రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తే భారత్‌పై ఆంక్షలు విధిస్తామనే హెచ్చరికలు పంపుతుంది. ఈ నేపథ్యంలో రష్యా- భారత్‌ల మైత్రిపై ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇస్తున్న అమెరికాకు భారత్‌ గట్టిగానే బదులిస్తున్నట్లు తెలుస్తోంది. 'డిస్కౌంట్‌కే ముడి చమురు ఇస్తామని రష్యా అంటుంది. దేశం కోసం రష్యా నుంచి చమరును కొనుగోలు చేస్తే తప్పేంటని' ప్రశ్నించారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.  

ఏప్రిల్‌ 1న జరిగిన 'ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్‌' కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'రష్యా నుంచి భారత్‌ ముడి చమురును కొనుగోలు చేసింది. ఆ కార్యకలాపాలు కొనసాగుతాయి. పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ అధ్యక్షతన మరింత చమురు ఉత్పత్తుల్ని సేకరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారని' అన్నారు.

 

చమురు ఉత్పత్తుల కొనుగోళ్లపై రష్యా డిస్కౌంట్‌లు అందిస్తుంది. ఈ ప్రోత్సహాకాలతో రష్యా నుంచి ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం రష్యా ఒక్కో బ్యారల్‌పై భారత్‌కు 35 డాలర్ల డిస్కౌంట్‌ ఇస్తుందని, యుద్ధానికి ముందే చమరు బ్యారెల్‌ కొనుగోళ్ల గురించి ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అయినా “నేను నా జాతీయ ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తాను. నా ఇంధన భద్రతకు మొదటి స్థానం ఇస్తాను. డిస్కౌంట్‌లో ముడి చమురు అందుబాటులో ఉంటే ఎందుకు కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే తప్పేంటని అర్ధం వచ్చేలా కేంద్రం ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

చదవండి: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, భారత్‌కు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు