పెట్రోల్‌, డిజీల్‌ ధరలు రూ. 12 పెరిగే ఛాన్స్‌..! జనాలు బంకులకు పరుగోపరుగు..! భారీగా పెరిగిన నిల్వలు

16 Mar, 2022 17:59 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిన్‌ ధరలు సరికొత్త రికార్డులు నమోదుచేసింది. దీంతో అంతర్జాతీయంగా పెట్రోల్‌, డిజీల్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెట్రోల్‌, డిజీల్‌ ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరు క్షణమే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో ప్రజలు తమ వాహనాల్లో ఫుల్‌ ట్యాంక్‌ చేసుకున్నారు.  మార్చి నెల తొలి పదేహేను రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డిజీల్‌ను ప్రజలు తమ వాహనాల్లో నింపుకున్నారు. 

కొత్త రికార్డులు..!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరల పెంపు ఉంటుందనే భయం ప్రజల్లో కన్పించింది. దీంతో మార్చి మొదటి రెండు వారాల్లో జనాలు భారీగా ఇంధనాన్నినిల్వ చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం..మార్చి 1 నుంచి 15 మధ్యకాలంలో భారత్‌కు చెందిన మూడు అతిపెద్ద రిటైలర్ల డీజిల్ విక్రయాలు  ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం  ఎక్కువగా 3.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయని పేర్కొంది. ఇక పెట్రోల్‌ మార్చి 1 నుంచి 15 మధ్య కాలంలో 1.23 మిలియన్ టన్నులతో పెట్రోలు విక్రయాలు జరిగాయి.  ఈ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18 శాతం ఎక్కువ. 2019 కాలంతో పోలిస్తే 24.4 శాతం అధికం. ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు సుమారు 132 రోజుల పాటు స్థిరంగా ఉన్నాయి. ఇక ఎల్‌పీజీ గ్యాస్‌ అమ్మకాలు అమ్మకాలు 17 శాతం పెరిగాయి. 

రూ. 12 కు పెరిగే ఛాన్స్‌..!
రష్యా ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధరలు సుమారు 80 డాలర్ల నుంచి 130 డాలర్లకు చేరకుంది.ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఫలితాల తరువాత ఇంధన ధరలు ఏకంగా రూ. 12 పెరిగే ఛాన్స్‌ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్‌, డిజీల్‌ రేట్లు మారలేదు.కాగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఎన్నికల ఆఫర్‌ త్వరలోనే ముగియనుంది వెంటనే మీ వాహనాల ట్యాంకులను ఫుల్‌ చేసుకోండి అంటూ ప్రజలకు హితవు పలికారు.

నష‍్టాల్ని పూడ్చుకోవాల్సిందే
పెట్రోల్‌, డిజీల్‌ అమ్మకాలు పెరగడానికి ఇంధన హోర్డింగ్ దోహదపడిందని  హర్దీప్ సింగ్ పురి పార్లమెంట్‌లో తెలియజేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రకారం, అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగిన తర్వాత నష్టాలను పూడ్చుకోవడానికి, అతిపెద్ద ఇంధన రిటైలర్ సంస్థలు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంధన ధరలు పెంపుకు రిటైలర్లు తగిన చర్యలు తీసుకుంటారని  కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ చెప్పారు.

చదవండి:  భారీ షాక్‌..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్‌ ధరలకు రెక్కలే..!

మరిన్ని వార్తలు