మన దగ్గర మైలేజీ కార్లు

5 Jun, 2021 16:16 IST|Sakshi

సెంచరీ దాటిన లీటరు పెట్రోలు

అదుపు లేకుండా పెరుగుతున్న ‍ఫ్యూయల్‌ రేట్లు

మైలేజీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ 

మైలేజీకి మరోపేరు మారుతి

ఫ్యూయల్‌ ఎకానమిలో హోండా భేష్‌

మైలేజీలో మెరుగైన ఫోర్డ్‌

వెబ్‌డెస్క్‌: పైకి వెళ్లడమే కాని కిందికి రావడం తెలియదు అన్నట్టుగా పెట్రోలు, డీజిల్‌ ధరలు దేశంలో పెరిగిపోతున్నాయి. మే నెలలో ఏకంగా 14 సార్లు పెరిగిన పెట్రోలు ధరలతో ఇప్పుడు చాలా సిటీల్లో పెట్రోలో ధరలు సెంచరీ మార్కును దాటేశాయి. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో కార్ల వాడకం పెరిగిపోయింది. దీంతో ఫ్యూయల్‌ ఎకానమి కార్లపై అందరి దృష్టి పడింది. ఆటోమేటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ARAI) చేపట్టిన సర్వే ప్రకారం మన దగ్గర ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్ల వివరాలు మీ కోసం....

మారుతి సుజూకి డిజైర్‌ / స్విఫ్ట్‌
మైలేజీకి మరో పేరుగా ముద్రపడ్డాయి మారుతి సుజూకి వెహికల్స్‌. ఈ కంపెనీ నుంచి వచ్చే మోడల్స్‌లో ప్రధానంగా ఆకట్టుకునేది మైలేజీ, మెయింటనెన్స్‌, సర్వీస్‌. మారుతి నుంచి వచ్చిన  డిజైర్, స్విఫ్ట్‌  మోడళ్లు మైలేజీలో అన్ని బండ్ల కంటే మిన్నగా నిలుస్తున్నాయి. అందుకే ఈ రెండు కార్ల సేల్స్‌ ఎ‍ప్పుడు అదుర్స్‌ అన్నట్టుగా ఉంటాయి. పెట్రోలు వెర్షన్‌ లీటర్‌కి 22 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా డీజిల్‌ వెర్షన్‌ 28.4  కిలోమీటర్ల మైలేజీ అందిస్తున్నాయి.

మారుతి సుజుకి సియాజ్‌
సెడాన్‌ సెగ్మెంట్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే వెహికల్‌గా సూయాజ్‌ నిలిచింది. మాన్యువల్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో 20.28 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా ఆటోమేటిక్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ఏకంగా 28.09 కిలోమీటర్ల మైలేజీ అందిస్తోంది.

హోండా అమేజ్‌
కాంపాక్ట్‌ సెడాన్‌ సెగ్మెంట్‌లో హోండా అమేజ్‌  ఎక్కువ మైలేజీ ఇస్తోంది. మాన్యువల్‌ డీజిల్‌ వేరియంట్‌ 27.4 ఆటోమేటిక్‌ డీజిల్‌ వేరియంట్‌ 23.8 కి.మీ మైలేజీ అందిస్తున్నాయి. పెట్రోల్‌ వెర్షన్‌కి సంబంధించి మాన్యువల్‌లో 19.5 కి.మీ ఆటోమేటిక్‌లో 19 కి.మీ దూరం పరిగెడుతున్నాయి అమేజ్‌ కార్లు. 

సుజూకి బాలెనో
హచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో బాలెనో మైలేజీ మెరుగైన రిజల్ట్స్‌ ఇస్తోంది. డీజిల్‌లో మాన్యువల్‌ వేరియంట్‌ 27.39 కి.మీ , ఆటోమేటిక్‌ వేరియంట్‌ 23.8 కి.మీ మైలేజీ అందిస్తున్నాయి. పెట్రోల్‌ ఇంజన్‌ కార్లలో మాన్యువల్‌ గేర్‌ 19.5 కి,మీ ఆటోమేటిక్‌ గేర్‌లో 19 కి.మీ మైలీజీ వస్తోంది.

హోండా జాజ్‌
హోండా జాజ్‌ డిజిల్‌ వేరియంట్‌ 27.3 కి.మీ ఉండగా ఆటోమేటిక్‌లో 19 కి.మీల మైలేజీ వస్తోంది. జాజ్‌లో మ్యానువల్‌ పెట్రోల ఇంజన్‌ కారు 18.2 కి.మీల మైలేజీ ఇస్తోంది. 

హ్యుండాయ్‌ గ్రాండ్‌ 10 నియోస్‌
హ్యుండాయ్‌లో సక్సెస్‌ ఫుల్‌ మోడల్‌గా పదేళ్లకు పైగా మార్కెట్‌లో కొనసాగుతున్న గ్రాండ్‌ సీరిస్‌లో  నియోస్‌ మరో కలికితురాయిగా మారింది. ఈ కారు డిజైన్‌కి ఇప్పటికే అభిమానులు ఫిదా అవుతుండగా మైలేజీలోనూ ఫీల్‌గుడ్‌ అనుభూతి ఇస్తోంది నియోస్‌. డీజిల్‌ వేరియంట్‌లో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ రెండింటిలో  26.2 కి.మీ మైలేజీ ఇస్తోంది. పెట్రోల్‌ వెర్షన్‌లో కూడా 20.7 కి.మీ మైలేజీ వస్తోంది.

ఫోర్డ్‌ అస్పైర్‌
ఫ్యూయల్‌ ఎకానమిలో ఇండియన్లను ఆకట్టుకునేందుకు ఫోర్డ్‌ చేసిన ప్రయత్నాల్లో రిలీజ్ చేసిన అస్పైర్‌ మోడల్‌ మైలేజీకి సంబంధించి డీజిల్‌ వేరియంట్‌ 26.1 కి.మీ, పెట్రోల్‌ వేరియంట్‌లో మాన్యువల్‌  20.4 కి.మీ, ఆటోమేటిక్‌ మోడల్‌​ 16.3 kmpl మైలేజీ ఇస్తోంది. 

హోండా సిటి
ప్రీమియం సెడాన్‌ కెటగిరలో హోండా సిటి మైలేజీలో మిన్నగా ఉంది. డీజిల్‌ వెర్షన్‌ 25.6 కి.మీలు ఉండగా పెట్రోల్‌ ఇంజన్లలో ఆటోమేటిక్‌ 18 కి.మీ, మాన్యువల్‌ 17.4 కి.మీల మైలేజీ ఇస్తున్నాయి. 


ఫోర్డ్‌ ఫిగో
హ్యచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో ఫోర్డ్‌ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన మోడల్‌ ఫిగో. మైలేజీలోనూ ఫిగో ఫలితాలు మెరుగ్గానే ఉన్నాయి. డీజిల్‌ వెర్షన్‌ 25.5 కి.మీ పెట్రోల్‌ వెర్షన్‌ 20.4 కి.మీ మైలేజీ అందిస్తున్నాయి. 
 

మరిన్ని వార్తలు