ఇంధన ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..!

5 Apr, 2022 21:51 IST|Sakshi

రష్యా ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగాయి. కానీ భారత్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఉండడంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాగా గత 13 రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి.  ఇంధన ధరల పెంపుతో సామాన్యులపై భారీ ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంట్‌లో కూడా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. కాగా  పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 

భారత్‌లోనే తక్కువ..!
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల చాలా తక్కువని అన్నారు. లోక్‌సభలో మంగళవారం హర్‌దీప్‌ సింగ్‌ పూరి ఇంధన ధరలపై మాట్లాడారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పెరిగిన ఇంధన ధరలు కేవలం 1/10 వంతుగా ఉన్నాయని వెల్లడించారు.

2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్య కాలంలో పెట్రోల్ ధరలు.. అమెరికాలో 51 శాతం, కెనడాలో 52 శాతం, జర్మనీలో 55 శాతం, యుకేలో 55 శాతం, ఫ్రాన్స్‌లో 50 శాతం, స్పెయిన్‌లో 58 శాతం పెరిగాయని పేర్కొనారు.కాగా భారత్‌లో కేవలం 5 శాతం మాత్రమే ఇంధన ధరలు పెరిగాయని వెల్లడించారు.  

చదవండి: గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇళ్ల విక్రయాలు..! హైదరాబాద్‌లో ఎలా ఉందంటే..?

మరిన్ని వార్తలు