Xiaomi Bumper Offer: రూ.15,999 స్మార్‌వాచ్‌.. రూ.7,999లకే.. ఇంకా మారెన్నో..

13 Nov, 2021 16:09 IST|Sakshi

Mi Accessories Bonanza : ఇండియాలో నంబర్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ సెల్లర్‌ కంపెనీగా రికార్డ్‌ సృష్టించిన షావోమీ ఎంఐ సంస్థ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. యాక్ససరీస్‌ బొనాంజా పేరుతో తగ్గింపు ధరలకే స్మార్ట్‌వాచ్‌, ఇయర్‌ఫోన్స్‌, ‍స్మార్ట్‌బ్యాండ్స్‌ తదితర యాక్సెసరీస్‌ని అందిస్తోంది.

యాక్సెసరీస్‌ బొనాంజా
స్మార్ట్‌ఫోన్లతో ఇండియా మార్కెట్‌లోకి ఎంటరైన షావోమి సంస్థ ఇక్కడ బలంగా పాతుకుపోయింది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌ట్యాప్స్‌, బ్యాగ్స్, స్మార్ట్‌వాచెస్‌, ఇయర్‌ఫోన్స్‌, పాకెట్‌ స్పీకర్స్‌ తదితర యాక్సెసరీస్‌ని ఇక్కడి ప్రజలకు పరిచయం చేసింది. తక్కువ ధరకే నాణ్యమైన ప్రొడక్టులు అందిస్తుండంతో ఎంఐకి ఇండియాలో భారీ కస్టమర్‌ బేస్‌ ఏర్పడింది. ఈ కస్టమర్ల కోసం యాభై శాతం డిస్కౌంట్‌తో యాక్సెసరీస్‌ అందిస్తోంది. ఈ మేరకు నవంబరు 13, 14 తేదీల్లో ప్రత్యేకంగా యాక్సెసరీస్‌ బొనాంజా సేల్స్‌ ప్రకటించింది. 

ఎంఐ వాచ్‌ రివాల్వ్‌
యాక్సెసరీస్‌ బొనాంజా సేల్స్‌లో స్మార్ట్‌వాచ్‌ రివాల్వ్‌పై అత్యధికంగా రూ. 8000ల వరకు తగ్గింపు ఎంఐ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఎంఆర్‌పీ ధర రూ.15,999లు ఉండగా ఈ ఆఫర్‌లో కేవలం రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

- 3.53 అమోల్డ్‌ డిస్‌ప్లే, సింగిల్‌ ఛార్జ్‌తో 14 రోజలు బ్యాటరీ బ్యాకప్‌
- పీపీజీ బయో సెన్సార్స్‌తో 24 గంటల రియల్‌టైమ్‌ మానిటరింగ్‌, 
- లైఫ్‌క్యూ సాయంతో స్లీప్‌ట్రాకింగ్‌, వైటల్‌ సైన్‌, స్ట్రెస్‌, బ్రీత్‌, హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌ ఫీచర్లు
- 10 ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ , 117 స్పోర్ట్స్‌ మోడ్స్‌ సపోర్ట్‌
-  ఆటోమేటిక​ వర్క్‌అవుట్‌ డిటెక‌్షన్‌
- జీపీఎస్‌, గ్లోనాస్‌, గాలిలియో, బీడీఎస్‌ సపోర్ట్‌
- అమెజాన్‌ అలెక్సా సపోర్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌
- ఈ రివాల్వ్‌ స్మార్ట్‌వాచ్‌లో మరో వేరియంట్‌ అమెజాన్‌లో రూ.6,999లకే లభిస్తోంది.

ఇతర ఆఫర్లు
- ఎంఐ ఇయర్‌ఫోన్‌ ఎంఆర్‌పీ ధర రూ.999 ఉండగా ప్రత్యేక తగ్గింపుగా రూ.199కే వస్తోంది
- ఎంఐ స్పోర్ట్స్‌ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ బేసిక్‌ ధర రూ.1799 ఉండగా ఈ ఆఫర్‌లో రూ.499కే వస్తోంది
- ఎంఐ స్మార్ట్‌బ్యాండ్‌ 4 ధర రూ.2499 ఉండగా యాక్సెసరీస్‌ బొనాంజా సేల్స్‌లో రూ.1,599కి అందిస్తోంది
- రెడ్‌మీ స్మార్ట్‌బ్యాండ్‌ ధర రూ.2099లు కాగా ఈ ఆఫర్‌లో రూ.1299కే వస్తోంది
- ఎంఐ పాకెట్‌ స్పీకర్‌ ధర రూ.1499 ఉండగా ఇప్పుడు రూ.799కే లభిస్తోంది.
- ఎంఐ ప్రొటెక్టివ్‌ గ్లాస్‌ ధర రూ.599 కాగా ఈ ఆఫర్‌లో రూ.49కే అందుబాటులో ఉంది.

చదవండి:షావోమీదే పైచేయి.. శాంసంగ్‌ వెనుకంజ

మరిన్ని వార్తలు