Facebook Sound Emoji: సౌండ్‌మోజీలతో మోర్‌ ఫన్‌.. ఎలా పంపాలో తెలుసా?

16 Jul, 2021 10:24 IST|Sakshi

రెగ్యులర్‌ ఛాటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో భావప్రకటన చేసేందుకు సులువైన మార్గాలే ఎమోజీలు. అవసరం ఉన్నా లేకున్నా వాటిని ఒకప్పుడు తెగ ఉపయోగించేవాళ్లు. అయితే జిఫ్‌ ఫైల్స్‌, స్టికర్ల రాకతో వీటి వాడకం కొంచెం తగ్గింది. ఈ తరుణంలో ఎమోజీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఫేస్‌బుక్‌ ఓ అడుగు ముందుకు వేసింది.

యూజర్లకు మరింత వినోదం అందించేందుకు సౌండ్‌ ఎమోజీలను తీసుకొచ్చింది. ఇందుకోసం ఫేస్‌బుక్‌ మెసేంజర్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది. గురువారం రాత్రి నుంచే సౌండ్‌ ఎమోజీలను పంపే వీలు కల్పించింది. శనివారం(జులై17న) వరల్డ్‌ ఎమోజీ డే. సో.. అంతకంటే ముందే ‘సౌండ్‌మోజీ’ పేరుతో ఫీచర్‌ను యూజర్లకు అందిస్తోంది ఫేస్‌బుక్‌. ఇంతకు ముందు ఒకటి రెండు ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఎక్కువ ఎమోజీలకు సౌండ్‌ ఎఫెక్ట్‌ యాక్సెస్‌ కల్పించింది మెసేంజర్‌.

మెసేంజర్‌లో ఎమోజీ లైబ్రరీ నుంచి కావాల్సిన ఎమోజీని పంపుకోవచ్చు. అయితే ఆ పక్కనే ఉన్న సౌండ్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. ఒకవేళ బటన్‌ గనుక కనిపించకుంటే.. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేం ఫుల్‌ వాల్యూమ్‌తో ఎమోజీలు పంపిస్తూ పండుగ చేసుకుంటున్నారు కొందరు యూజర్లు. ఇక ఈ విషయాన్ని అధినేత జుకర్‌బర్గ్‌ కూడా కన్ఫర్మ్‌ చేశాడు.

మరిన్ని వార్తలు