5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్య సాకారానికి స్టార్టప్‌లు

19 Dec, 2022 06:31 IST|Sakshi

ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన సిడ్బీ

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి లక్ష్యమైన ‘2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం’ సాకారానికి స్టార్టప్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ స్టార్టప్‌ల నిధుల అవసరాలను తీర్చడంలో ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌) కీలకంగా పనిచేస్తాయని చిన్న పరిశ్రమ అభివృద్ధి బ్యాంక్‌ (సిడ్బీ) సీఎండీ సుబ్రమణియన్‌ రామన్‌ పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిధుల అవసరాలు, అభివృద్ధి, ప్రోత్సాహకాలను సిడ్బీ చూస్తుంటుంది.

ఈ నెల 27న ఇన్వెస్టర్‌ కనెక్ట్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్, వాణిజ్య బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. స్టార్టప్‌లకు సంబంధించి ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్, కొత్తగా ఏర్పాటైన క్రెడిట్‌ గ్యారంటీ స్టార్టప్‌లకు సంబంధించి సమాచారాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. స్టార్టప్‌లకు కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా డీపీఐఐటీ జాయింట్‌ సెక్రటరీ శృతీసింగ్‌ అభినందించారు.  

మరిన్ని వార్తలు